ETV Bharat / sports

కోలుకున్న ఇషాంత్.. నేటి మ్యాచ్​లో బరిలోకి! - గాయం నుంచి కోలుకున్న ఇషాంత్ శర్మ

దిల్లీ క్యాపిటల్స్ పేసర్ ఇషాంత్ శర్మ గాయం నుంచి కోలుకున్నాడు. ప్రస్తుతం అతడు ఫిట్​నెస్ సాధించాడని ఫ్రాంచైజీ అధికారి తెలిపారు. అయితే ఇషాంత్ నేడు ముంబయి జట్టుతో జరిగే మ్యాచ్​లో ఉంటాడా?లేదా అనేది ఇంకా తెలియరాలేదు.

Ishant sharma
ఇషాంత్
author img

By

Published : Apr 20, 2021, 4:39 PM IST

Updated : Apr 20, 2021, 6:39 PM IST

ముంబయి ఇండియన్స్​తో మ్యాచ్​కు ముందు దిల్లీ క్యాపిటల్స్​ అభిమానులకు శుభవార్త. గాయం కారణంగా ఈ సీజన్​లో తొలి మూడు మ్యాచ్​లు ఆడని పేసర్ ఇషాంత్ శర్మ కోలుకున్నాడు. నేడు ముంబయితో జరిగే మ్యాచ్​లో బరిలో దిగబోతున్నాడని తెలుస్తోంది. అయితే ఇతడి స్థానంలో బరిలో దిగిన ఆవేశ్ ఖాన్ మంచి ప్రదర్శన చేయడం వల్ల ఫిట్​నెస్ సాధించిన ఇషాంత్ తుదిజట్టులో ఉంటాడా?లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

దిల్లీ జట్టులో సీనియర్ పేసర్​గా సేవలందిస్తున్నాడు ఇషాంత్. కానీ ఫిట్​నెస్ సమస్యలతో కొంతకాలంగా జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నాడు. గతేడాది లీగ్​లో కేవలం ఒకే మ్యాచ్​ ఆడిన ఇతడు గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. 2019 సీజన్​లో 7.13 ఎకానమీతో 13 వికెట్లు తీసి సత్తాచాటాడు.

Last Updated : Apr 20, 2021, 6:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.