IPL 2023 Subhmann Gill Records : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ శుభమన్ గిల్ ఇన్నింగ్స్.. అతడితో పాటు అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అతడి కెరీర్లో బెస్ట్ సీజన్‌గా మిగిలిపోతుంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో నాలుగో సెంచరీ బాదుతాడని గుజరాత్ ఫ్యాన్స్ ఆశించినప్పటికీ అది కుదరలేదు. చెన్నై కెప్టెన్ మహీ.. సూపర్ ఫాస్ట్ స్టంపింగ్‌తో 39 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. దీంతో ఈ సీజన్‌లో అతడి ఇన్నింగ్స్‌కు తెరపడింది.
-
𝐇𝐢𝐠𝐡𝐞𝐬𝐭 𝐫𝐮𝐧-𝐬𝐜𝐨𝐫𝐞𝐫 𝐢𝐧 #𝐓𝐀𝐓𝐀𝐈𝐏𝐋 𝟐𝟎𝟐𝟑! 💥@ShubmanGill, 𝗧𝗔𝗞𝗘 𝗔 𝗕𝗢𝗪! 🙇🏼🙇🏼♀️#CSKvGT | #PhariAavaDe | #Final pic.twitter.com/c2GMQNMyqZ
— Gujarat Titans (@gujarat_titans) May 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">𝐇𝐢𝐠𝐡𝐞𝐬𝐭 𝐫𝐮𝐧-𝐬𝐜𝐨𝐫𝐞𝐫 𝐢𝐧 #𝐓𝐀𝐓𝐀𝐈𝐏𝐋 𝟐𝟎𝟐𝟑! 💥@ShubmanGill, 𝗧𝗔𝗞𝗘 𝗔 𝗕𝗢𝗪! 🙇🏼🙇🏼♀️#CSKvGT | #PhariAavaDe | #Final pic.twitter.com/c2GMQNMyqZ
— Gujarat Titans (@gujarat_titans) May 29, 2023𝐇𝐢𝐠𝐡𝐞𝐬𝐭 𝐫𝐮𝐧-𝐬𝐜𝐨𝐫𝐞𝐫 𝐢𝐧 #𝐓𝐀𝐓𝐀𝐈𝐏𝐋 𝟐𝟎𝟐𝟑! 💥@ShubmanGill, 𝗧𝗔𝗞𝗘 𝗔 𝗕𝗢𝗪! 🙇🏼🙇🏼♀️#CSKvGT | #PhariAavaDe | #Final pic.twitter.com/c2GMQNMyqZ
— Gujarat Titans (@gujarat_titans) May 29, 2023
ఈ సీజన్‌లో గిల్ ప్రదర్శన, రికార్డులు..
IPL 2023 Gill runs : అయితే ఈ సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ దక్కించుకోనున్న శుభమన్ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. గిల్ ఈ సీజన్‌లో 71 మ్యాచులు ఆడి మొత్తంగా 890 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు సహా నాలుగు హాఫ్‌సెంచరీలు ఉన్నాయి. ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా, తొలి టీమ్ఇండియా ఆటగాడిగా విరాట్ కోహ్లీ(2021-973 పరుగులు) ఉన్నాడు. ఇప్పుడు అతడి తర్వాతి స్థానంలో గిల్ నిలిచాడు. 2022 సీజన్‌లో 863 పరుగులు చేసిన జోస్ బట్లర్, డేవిడ్ వార్నర్ 848 పరుగులు(హైదరాబాద్, 2016), కేన్ విలియమ్సన్ 735 పరుగులు(హైదరాబాద్, 2018)ను అధిగమించాడు.
ఇంకా ఈ సీజన్‌లో అతడకిది 13వ 30 ప్లస్ స్కోరు. ఒకే సీజన్‌లో అత్యధిక సార్లు 30ప్లస్ స్కోర్లు చేసిన బ్యాటర్‌గా రికార్డుకెక్కాడు. 2016లో విరాట్ కోహ్లీ అత్యధికంగా 12 సార్లు 30 ప్లస్ స్కోర్లు చేయగా.. 2018లో కేన్ విలియమ్సన్ 12 సార్లు 30 ప్లస్ స్కోర్లు చేశాడు.
ఇంకా ఈ సీజన్‌లో 118 బౌండరీలు బాదిన గిల్.. ఒకే సీజన్‌లో అత్యధిక బౌండరీలు బాదిన నాలుగో ప్లేయర్‌గాను నిలిచాడు. 2022లో జోస్ బట్లర్ 128 బౌండరీలు కొట్టాడు. 2016లో విరాట్ కోహ్లీ 122, 2016లో డేవిడ్ వార్నర్ 119 బౌండరీలు కొట్టారు.
ప్లేఆఫ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గాను నిలిచాడు శుభమన్ గిల్. 2022లో జోస్ బట్లర్ ప్లేఆఫ్స్‌లో 234 పరుగులు చేయగా.. ఇప్పుడు గిల్ 210 పరుగులు చేశాడు. ప్లేఆఫ్స్‌లో ఒకే సీజన్‌లో 200లకు పైగా పరుగులు చేసిన బ్యాటర్లు వీరిద్దరే కావడం విశేషం.
ఇదీ చూడండి:
చాహర్ వదిలేసిన ధోనీ వదల్లేదు.. సూపర్ స్టంపౌట్.. గిల్ పరుగులకు ఎండ్ కార్డ్!
మహీ కోసం రాత్రంతా రోడ్లపైనే.. ఫ్యాన్స్‌కు సిక్‌లీవ్ కష్టాలు.. ఇంతకీ ఫైనల్ జరుగుతుందా?