ఐపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్‌కి మధ్య తొలి పోరు ఆరంభమయ్యింది. ఈ క్రమంలో టాస్ గెలిచిన గుజరాత్ బౌలింగ్‌ను ఎంచుకుంది. ఆడిన తొలి సీజన్లోనే టైటిల్ విజేతగా నిలిచిన గుజరాత్ టైటాన్స్ టీమ్.. ఈ సీజన్లోనూ విజయంతో ప్రారంభించింది. మార్చి 31న జరిగిన తొలి మ్యాచ్‌లో సీఎస్కేపై గెలిచిన గుజరాత్ ఇప్పుడు రెండో మ్యాచ్‌కు సిద్ధమయ్యింది. ఈ క్రమంలో దిల్లీ జట్టును వారి సొంత మైదానంలోనే ఎదుర్కోనుంది. అయితే..అన్ని విభాగాల్లోనూ రాణిస్తున్న ఆల్‌రౌండర్ హర్దిక్ పాండ్య జట్టుకు తొలి మ్యాచ్‌లోనే ఎదురు దెబ్బ తగిలింది. మ్యాచ్ సమయంలో బాల్ పట్టేందుకు ప్రయత్నించి గాయాలపాలైన స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ చికిత్స కోసం న్యూజిలాండ్‌కు పయనమయ్యాడు. దీంతో ఈ సీజన్‌కు దూరమయ్యాడు. నొప్పితో విలవిల్లాడుతూ మైదానాన్ని వీడగా.. అతడి స్థానంలో సాయి సుదర్శన్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చాడు.
ఇక ఇప్పడు కేన్ స్థానాన్ని దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్‌తో భర్తీ చేశారు. మరోవైపు దిల్లీ తొలి మ్యాచ్‌లో లఖ్‌నవూపై 50 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో మంగళవారం గుజరాత్‌తో జరగనున్న మ్యాచ్‌లోనైనా విజయం సాధించాలని కసిగా ఉంది. అయితే.. దిల్లీ తమ పేస్ అటాక్‌ను మెరుగుపర్చుకోవాల్సి ఉంది. శుభ్‌మన్‌గిల్ లాంటి ఆటగాళ్లను అడ్డుకోవాలంటే సరైన ప్రణాళికలతో బరిలోకి దిగాలి. కాగా దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరగుతున్న ఈ మ్యాచ్‌కు దిల్లీ టీమ్ ప్లేయర్ రిషబ్ పంత్ హాజరవ్వనున్నాడన్న వార్తలు సైతం వినిపించాయి.
అయితే తొలి మ్యాచ్‌లో చెన్నైపై అద్భుత విజయాన్ని సాధించిన గుజరాత్ ఇప్పుడు మరింత జోరు మీదుంది. అర్థ సెంచరీతో మైదానంలో అదరగొట్టిన యంగ్ ప్లేయర్ శుభ్‌మన్‌గిల్ పై అందరి ఆశలు ఉన్నాయి. రషీద్‌ఖాన్, వృద్ధిమన్ సాహా, రాహుల్ తేవాతియా, విజయ్ శంకర్ బ్యాటింగ్‌లో సమిష్టిగా ఆకట్టుకున్నారు. స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్‌తో గుజరాత్ బలంగా కనిపిస్తోంది. ఫస్ట్ మ్యాచ్‌లో కెప్టెన్ హార్దిక్ పాండ్య అటు బ్యాటింగ్‌తో పాటు ఇటు పాటు బౌలింగ్‌లోనూ చెలరేగిపోయాడు. ఇక చెన్నై పై ధారాళంగా పరుగులు ఇచ్చిన జోషువా లిటిల్ స్థానంలో ఈ మ్యాచ్‌లో మరో ఆటగాడికి ఛాన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆ ఒక్క మార్పు తప్ప తుది జట్టులోపెద్దగా మార్పులు ఉండే అవకాశం కనిపించడం లేదు.
భారమంతా కెప్టెన్‌పైనే..
మరోవైపు లఖ్‌నవూతో జరిగిన తొలి మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్ ఓటమి పాలైంది. వార్నర్ మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్ ఆ మ్యాచ్‌లో రాణించకపోవడం జట్టును తీవ్రంగా దెబ్బతీసింది. దీంతో గుజరాత్‌తో జరగనున్న మ్యాచ్‌లోనూ వార్నర్‌పైనే ఎక్కువగా భారం పడేలా ఉంది. దేశవాళీలో రాణించిన పృథ్వీషా, సర్పరాజ్‌ఖాన్ నేటి మ్యాచ్‌లో రాణించాల్సిన అవసరం ఉంది.
మరోవైపు రూసో, పావెల్ చెలరేగితే మాత్రం గుజరాత్‌కు కష్ట కాలం ఎదురైనట్లే. లఖ్‌నవూ మ్యాచ్‌లో ఆకట్టుకున్న యంగ్ పేసర్ చేతన్ సకారియాకు ఈ మ్యాచ్‌లో చోటు దక్కే అవకాశాలున్నాయి. ఇక స్పిన్ ద్వయం అక్షర్, కుల్దీప్ గుజరాత్‌ను కట్టడి చేస్తే ఈ మ్యాచ్‌లో దిల్లీకి ఓటమి తప్పదు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌తో దిల్లీ క్యాపిటల్స్ ఒకేసారి తలపడింది.