ETV Bharat / sports

ఐపీఎల్​లో గబ్బర్ రికార్డు.. కోహ్లీ తర్వాత అతడే

author img

By

Published : Apr 25, 2022, 8:40 PM IST

IPL 2022 Shikhar Dhawan: స్టార్ బ్యాటర్ శిఖర్ ధావన్.. ఐపీఎల్​లో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఈ లీగ్​లో 6 వేల పరుగులు చేసిన రెండో బ్యాటర్​గా రికార్డు సాధించాడు. మొత్తంగా టీ20ల్లో 9 వేల పరుగులు చేశాడు.

Shikhar Dhawan completes 6000 runs in IPL

IPL 2022 Shikhar Dhawan: భారత స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఐపీఎల్​లో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఈ లీగ్​లో 6 వేల పరుగులు చేసిన రెండో బ్యాటర్​గా రికార్డుకెక్కాడు. సీఎస్కేతో మ్యాచ్​లో రెండో ఓవర్ తొలి బంతికి సింగిల్ తీసి.. ఐపీఎల్​లో 6వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు ధావన్. మెగాలీగ్​లో విరాట్ కోహ్లీ తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు ధావన్. విరాట్ కోహ్లీ 6402 పరుగులతో తొలి స్థానంలో ఉన్నాడు.

ధావన్

Shikhar Dhawan t20 runs: అదేసమయంలో ఐపీఎల్, అంతర్జాతీయ టీ20లు కలిపి 9 వేలకు పైగా పరుగులు చేశాడు ధావన్. ఇదే ఇన్నింగ్స్​లో ఈ ఘనత అందుకున్నాడు. కోహ్లీ, రోహిత్ తర్వాత టీ20లలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్​గా ధావన్ కొనసాగుతున్నాడు. టీ20ల్లో కోహ్లీ, రోహిత్ ఇప్పటికే పది వేలకు పైగా పరుగులు చేశారు. ధావన్​కు ఇది 200వ ఐపీఎల్ మ్యాచ్ కాగా.. ఇందులోనే రెండు రికార్డులు నమోదు చేయడం విశేషం.

Dhawan IPL records: ఐపీఎల్​లో బెస్ట్ ఓపెనర్లలో ఒకడిగా ధావన్ రికార్డుకెక్కాడు. ఈ లీగ్​లో రెండు వరుస ఇన్నింగ్స్​ల్లో సెంచరీలు చేసిన తొలి బ్యాటర్​గా ఘనత సాధించాడు. 45 అర్ధశతకాలు అతడి పేరుమీద ఉన్నాయి. గతంలో ముంబయి, డెక్కన్ ఛార్జర్స్, సన్​రైజర్స్, దిల్లీ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు గబ్బర్.

ఇదీ చదవండి:

'రషీద్ ఖాన్ వికెట్ టేకర్ కాదు.. ఆ ఎకానమీ దండగే!'

భార్య పర్మిషన్​తో మాజీ క్రికెటర్ రెండో పెళ్లి.. 28 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్నా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.