రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ(RCB Captain).. ప్రస్తుత ఐపీఎల్ సీజన్(IPL 2021) మధ్యలోనే సారథ్య బాధ్యతలను వదులుకోనున్నాడని ప్రచారం జరుగుతోంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో(RCB Vs KKR 2021) జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాజయం తర్వాత కోహ్లీ కెప్టెన్సీపై విమర్శలు వస్తున్నాయి. మళ్లీ ఇదే తరహాలో ఆర్సీబీ జట్టు భారీ ఓటమిని చవిచూస్తే కోహ్లీ ఆ బాధ్యతల(Kohli Captaincy) నుంచి తప్పుకోవడం తప్పదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
ఒకవేళ అలాంటి పరిణామాలే ఎదురైతే.. కోహ్లీ తప్పుకోకపోయినా, ఆర్సీబీ యాజమాన్యం అతడిని తప్పించే అవకాశం ఉందనేది కొందరు సీనియర్ ఆటగాళ్ల వాదన. విరాట్‌పై ఒత్తిడిని తగ్గించేందుకైనా ఈ నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదని వారంటున్నారు.
ఇలాంటి పరిణామాలే..
గతంలో దినేశ్ కార్తిక్(KKR Captain), వార్నర్‌ల విషయంలోనూ కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH Captain) ఇలాంటి నిర్ణయాన్నే తీసుకున్నాయి. దీంతో ఆర్సీబీ మేనేజ్మెంట్ కూడా ఇదే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది.
కెప్టెన్‌గా కోహ్లీ..
2013లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన విరాట్ కోహ్లీ.. 132 మ్యాచ్‌ల్లో, 62 గెలిపించాడు. మరో 66 మ్యాచ్‌ల్లో ఓటమిపాలవ్వగా, నాలుగింటిలో ఫలితం తేలలేదు.
డివిలియర్స్‌కే పగ్గాలు?
ఆర్సీబీ సారథ్య బాధ్యతల నుంచి కోహ్లీ తప్పుకొన్న తర్వాత కొత్త కెప్టెన్ ఎవరు అనే విషయం ఇప్పుడు తెరపైకి వచ్చింది. జట్టులోని సీనియర్ ప్లేయర్‌గా, కెప్టెన్సీ చేసిన అనుభవం ఉన్న ఆటగాడికే ఆ టీమ్ యాజమాన్యం అధిక ప్రాధాన్యం ఇవ్వనుంది! అయితే జట్టులోని సీనియర్ ఆటగాడు ఏబీ డివిలియర్స్. కాబట్టి అతడికే కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఒకవేళ డివిలియర్స్ ఈ ఆఫర్‌ను తిరస్కరిస్తే.. స్టార్ బ్యాట్స్‌మన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు ఆ ఛాన్సు రావొచ్చు.
ఇదీ చూడండి.. పారాలింపిక్స్‌లో భారత తొలి స్వర్ణం వెనుక అంత కథ ఉందా!