క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్! యూఏఈ వేదికగా జరగనున్న ఐపీఎల్-2021లో మ్యాచ్‌లను(IPL 2021) చూసేందుకు ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయించారు. అయితే పరిమిత స్థాయిలోనే అనుమతించనున్నట్లు((IPL 2021 Spectators Allowed) ఐపీఎల్ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఐపీఎల్ 2021 గత మార్చిలో ఇండియాలో ప్రారంభమైనా.. కరోనా కారణంగా వాయిదా(IPL 2021 Postponed) పడింది. టోర్నీ రెండోదశ(IPL 2021 2nd Phase) సెప్టెంబరు 19 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్(MI Vs CSK) జట్లు తలపడనున్నాయి. ఐపీఎల్ రెండోదశలోని మ్యాచ్‌లను దుబాయ్, షార్జా, అబుదాబి వేదికల్లో నిర్వహించనున్నారు. యూఏఈ ప్రభుత్వం జారీ చేసిన కొవిడ్ నిబంధనలను(New Covid Rules in UAE) పాటిస్తూ టోర్నీని నిర్వహిస్తామని ఐపీఎల్ నిర్వాహకులు వెల్లడించారు.
రెండేళ్ల తర్వాత..
కరోనా సంక్షోభం తర్వాత ప్రేక్షకుల(IPL 2021 Spectators) మధ్య ఐపీఎల్ టోర్నీని నిర్వహించడం ఇదే తొలిసారి. చివరిగా 2019లో ఫ్యాన్స్ సమక్షంలో మ్యాచ్‌లను నిర్వహించారు. కరోనా కారణంగా గతేడాది యూఏఈలో ఖాళీ స్టేడియాల్లోనే మ్యాచ్‌లు జరిగాయి. ఈ ఏడాది అదే తరహలో భారత్ వేదికగా నిర్వహించినా.. టోర్నీ మధ్యలో ఆటగాళ్లకు కరోనా సోకడం వల్ల అర్ధాంతరంగా వాయిదా వేశారు.
ఇప్పుడు యూఏఈలో బయోబబుల్‌ను(IPL Bio-Bubble) ఏర్పాటు చేసి.. ఐపీఎల్ 14వ సీజన్ రెండోదశను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ మ్యాచ్‌లకు 50 శాతం మంది ప్రేక్షకులను అనుమతించేందుకు ఐపీఎల్ నిర్వాహకులు నిర్ణయించారు. అభిమానులు టికెట్లను(IPL 2021 Tickets UAE) ఐపీఎల్ అధికారిక వెబ్‌సైట్ www.iplt20.com లో కొనుగోలు చేయవచ్చని తెలిపారు. గురువారం(సెప్టెంబరు 16) నుంచి టికెట్లు అందుబాటులో ఉంటాయని వారు ప్రకటనలో పేర్కొన్నారు.
ఇదీ చూడండి.. T20I Rankings: టీ20 ర్యాంకింగ్స్‌లో కోహ్లీ, కేఎల్ రాహుల్ మెరుపులు