ఐపీఎల్ 2021(IPL 2021 News)లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్(SRH vs PBKS 2021) తడబడింది. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. కెప్టెన్ రాహుల్ (21) పర్వాలేదనిపించగా మయాంక్ అగర్వాల్ (5), గేల్ (14), నికోలస్ పూరన్ (8) పూర్తిగా విఫలయ్యారు. తర్వాత దీపక్ హుడాతో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు మర్క్రమ్. సమయోచితంగా ఆడుతూ పరుగులు రాబట్టాడు. కానీ కుదురుకుంటున్న సమయంలో మర్క్రమ్ (27) పెవిలియన్ చేర్చాడు అబ్దుల్ సమద్. ఆ తర్వాత హుడా (13) కూడా వెనుదిరగడం వల్ల పంజాబ్ ఇన్నింగ్స్ పట్టు తప్పింది. చివర్లో హర్‌ప్రీత్ (18), నాథన్ ఎల్లిస్ (12) కాసేపు పోరాడారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులకే పరిమితమైంది పంజాబ్.
IPL 2021 News: సన్‌రైజర్స్ బౌలర్ల విజృంభణ.. పంజాబ్ 125/7 - సన్‌రైజర్స్-పంజాబ్ కింగ్స్ లైవ్ స్కోర్
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్(SRH vs PBKS 2021) నిర్ణీత 20 ఓవర్లలో 125 పరుగులు చేసింది. మర్క్రమ్ (27) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
![IPL 2021 News: సన్‌రైజర్స్ బౌలర్ల విజృంభణ.. పంజాబ్ 125/7 IPL](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13173519-15-13173519-1632583281959.jpg?imwidth=3840)