ETV Bharat / sports

హైదరాబాద్​లోనూ ఐపీఎల్ మ్యాచ్​లు! - హైదరాబాద్​లో ఐపీఎల్ మ్యాచ్​లు

ముంబయిలోని వాంఖడే మైదాన సిబ్బందితో పాటు ఈవెంట్​ మేనేజర్లకు కొవిడ్ సోకినట్లు నిర్ధరణ కావడం ఐపీఎల్​ అభిమానుల్ని కలవరపరుస్తోంది. ఒకవేళ అక్కడి పరిస్థితి చేయిదాటితే, ఆ మ్యాచ్​ల్ని హైదరాబాద్​లో నిర్వహించే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Hyderabad likely to be backup venue for IPL 14
హైదరాబాద్​లోనూ ఐపీఎల్ మ్యాచ్​లు?
author img

By

Published : Apr 3, 2021, 5:36 PM IST

ఐపీఎల్​లో భాగంగా ముంబయి వాంఖడే స్టేడియంలో ఈసారి 10 మ్యాచ్​లు జరగనున్నాయి. కానీ ఇప్పుడు 10 మంది మైదాన సిబ్బందితో పాటు ఆరుగురు ఈవెంట్​ మేనేజర్లకు కరోనా పాజిటివ్​గా తేలింది. దీంతో అక్కడి మ్యాచ్​లు జరుగుతాయా లేదా? అని అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఇక్కడ జరగకపోతే, వాటిలో కొన్ని హైదరాబాద్​లో నిర్వహించే అవకాశముందని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు.

"ఒకవేళ ఇక్కడ(ముంబయి) లాక్​డౌన్​ పెట్టినా సరే, జట్లు బయో బబుల్​లో ఉన్నాయి. ప్రేక్షకుల్లేకుండానే మ్యాచ్​లు జరుగుతాయి. కాబట్టి ముంబయిలో మ్యాచ్​లపై పూర్తి నమ్మకంతో ఉన్నాం. షెడ్యూల్​ ప్రకారం ఇక్కడ చెన్నై-దిల్లీ జట్ల మధ్య ఏప్రిల్ 10న తొలి మ్యాచ్​ జరుగుతుంది. ఒకవేళ పరిస్థితి చేయిదాటితే హైదరాబాద్, ఇండోర్ ప్రత్యామ్నయ వేదికలుగా ఉన్నాయి" అని బీసీసీఐ అధికారి స్పష్టం చేశారు.

ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ఏప్రిల్​ 10 నుంచి 25 వరకు పది మ్యాచ్​లు జరగనున్నాయి. ఏప్రిల్ 10న తొలి పోరులో దిల్లీ, చెన్నై తలపడనున్నాయి.

మహారాష్ట్రలో రోజురోజుకీ కొవిడ్ కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 47వేల 827 కొత్త కేసులు వెలుగుచూశాయి. 202 మరణాలు నమోదయ్యాయి. ఒక్క ముంబయిలోనే 8,832 కేసులు వచ్చాయి. 8,500 పైగా కేసులు రావడం ఇది వరుసగా రెండో రోజు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.