పంజాబ్ కింగ్స్‌తో జరుగుతోన్న ఐపీఎల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు రెచ్చిపోయారు. ముఖ్యంగా దీపక్ చాహర్ పవర్‌ప్లేలోనే ప్రత్యర్థి జట్టు టాపార్డర్‌ను పెవిలియన్ చేర్చాడు. దీంతో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది.
ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే మయాంక్ అగర్వాల్(1)ను అద్భుత ఔట్ స్వింగర్‌తో బోల్తా కొట్టించాడు దీపక్ చాహర్. తర్వాత కెప్టెన్ రాహుల్ (5) రనౌట్‌గా వెనుదిరిగాడు. గేల్, రాహుల్ వికెట్ల మధ్య సమన్వయ లోపంతో తడబడగా వికెట్లను నేరుగా గిరాటేసి అద్భుత ఫీల్డింగ్‌తో రాహుల్‌ను పెవిలియన్ చేర్చాడు జడేజా. తర్వాత దీపక్ బౌలింగ్‌లో గేల్ (10) జడేజా అద్భుత క్యాచ్‌తో వెనుదిరిగాడు. అనంతరం అదే ఓవర్లో నికోలస్ పూరన్ (0)ను కూడా ఔట్ చేసిన దీపక్, మరో ఓవర్లో దీపక్ హుడా (10)ను పెవిలియన్ చేర్చి సీఎస్కే శిబిరంలో ఆనందంనింపాడు.
జే రిచర్డ్సన్ (15) కాసేపు పోరాడినా.. మొయిన్ అలీ స్పిన్ వలలో చిక్కుకుని బౌల్డయ్యాడు. అనంతరం యువ బ్యాట్స్‌మన్ షారుఖ్ ఖాన్ (47) అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్ని పంజాబ్ గౌరవప్రదమైన స్కోర్ చేయడంలో కీలకపాత్ర పోషించాడు. చివరి ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించి సామ్ కరన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఫలితంగా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది పంజాబ్.