IPL Mini Auction 2023: ఐపీఎల్ 2023 మినీ వేలం ముగిసింది. ఆటగాళ్ల కొనుగోలుకు పది ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. దాదాపు రూ. 160 కోట్లకు వెెచ్చించి మరీ ఆటగాళ్లను సొంతం చేసుకున్నాయి. శామ్ కరణ్‌ను రికార్డు ధర రూ. 18.5 కోట్లకు పంజాబ్ జట్టు సొంతం చేసుకుంది.
టాప్ 10 ప్లేయర్స్ వీళ్లే :
1. శామ్ కరన్
ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ శామ్ కరన్ చరిత్ర సృష్టించాడు. శుక్రవారం జరుగుతోన్న ఐపీఎల్ మినీ వేలంలో అతడు రికార్డు ధరకు అమ్ముడయ్యాడు. రూ.18.50 కోట్లకు పంజాబ్ అతడిని దక్కించుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఇదే అత్యధిక ధర కావడం విశేషం. అంతకుముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా ఆటగాడు క్రిస్ మోరిస్ పేరిట ఉంది. 2021లో జరిగిన మినీ వేలంలో మోరిస్‌ను రాజస్థాన్ జట్టు రూ.16.25కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడా రికార్డును శామ్ కరన్ బద్దలుకొట్టాడు.
2. కామెరూన్ గ్రీన్
ఇక ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ కూడా మోరిస్ రికార్డును దాటి ఐపీఎల్ వేలం చరిత్రలో రెండో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. నేటి వేలంలో ముంబయి అతడిని రూ.17.50కోట్లకు దక్కించుకుంది.
3. బెన్ స్టోక్స్
4. నికోలస్ పూరన్
వెస్టిండీస్ బ్యాటర్ నికోలస్ పూరన్‌ను లఖ్‌నవూ జట్టు రూ.16కోట్లకు దక్కించుకుంది.
5. హ్యారీ బ్రూక్
ఇంగ్లాండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్‌ను హైదరాబాద్ జట్టు రూ.13.25 కోట్లకు సొంతం చేసుకుంది.
6. మయాంక్ అగర్వాల్
టీమ్ఇండియా బ్యాటర్ మయాంక్ అగర్వాల్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 8.25 కోట్లకు దక్కించుకుంది.
7. శివం మవి
టీమ్ఇండియా ప్లేయర్ శివం మవిని గుజరాత్ టైటాన్స్ రూ. 6 కోట్లకు సొంతం చేసుకుంది.
8. జేసన్ హోల్డర్
ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్‌ను రూ. 5.75 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది.
9. ముఖేశ్ కుమార్
బౌలర్ ముఖేశ్ కుమార్‌ను దిల్లీ క్యాపిటల్స్ రూ. 5.50 కోట్లకు సొంతం చేసుకుంది.
10. హెన్రిచ్ క్లాసెన్
దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 5.25 కోట్లకు దక్కించుకుంది.