IPL 2024 Mini Auction Crore Players : 2024 ఐపీఎల్ సందడి మొదలైంది. రీసెంట్గా ప్లేయర్ల ట్రేడింగ్ ప్రక్రియ కూడా ముగిసింది. ఇక అందరి దృష్టి.. డిసెంబర్ 19న జరిగే మినీ వేలంపైనే ఉంది. దుబాయ్ వేదికగా జరిగే ఈ వేలంలో 1166 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉండనున్నారు. అందులో 212 మంది క్యాప్డ్, 909 మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్లున్నారు. వారిలో 830 మంది భారత క్రికెటర్లు, 45 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.
అయితే ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా విదేశీ ప్లేయర్లు రికార్డు ధరకు అమ్ముడయ్యే ఛాన్స్ ఉంది. గతంలో బెన్ స్టోక్స్, శామ్ కరన్, కామెరూన్ గ్రీన్ లాంటి విదేశీ ప్లేయర్లు.. ఆయా సీజన్ వేలంలో భారీ మొత్తానికి అమ్మడయ్యారు. అయితే 2024 ఐపీఎల్ ఎడిషన్‌కు 30 స్లాట్లకుగాను 45 మంది విదేశీ ఆటగాళ్లు మినీ వేలంలో ఉన్నారు. విదేశీ ఆటగాళ్లలో ముఖ్యంగా న్యూజిలాండ్ యంగ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, మిచెల్ స్టార్క్, శామ్ బిల్లింగ్స్ ఈసారి ఎక్కువ మొత్తానికి అమ్ముడవ్వచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ట్రావిస్ హెడ్‌ను దక్కించుకునేందుకు ఆయా ఫ్రాంచైజీలు పెద్ద మొత్తంలో ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నాయట. మరి ఈ వేలంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న విదేశీ ఆటగాళ్లు వీళ్లే!
బేస్ ప్రైజ్ రూ. 2 కోట్ల ప్లేయర్లు..
- ట్రావిస్ హెడ్ - ఆస్ట్రేలియా
- ప్యాట్ కమిన్స్ - ఆస్ట్రేలియా
- మిచెల్ స్టార్క్ - ఆస్ట్రేలియా
బేస్ ప్రైజ్ రూ. 1.5 కోట్ల ప్లేయర్లు..
- మహ్మద్ నబీ - అఫ్గానిస్థాన్
- క్రిస్ లిన్ - ఆస్ట్రేలియా
- టామ్ కరన్ - ఇంగ్లాండ్
- కొలిన్ మున్రో - న్యూజిలాండ్
- వానిందు హసరంగ - శ్రీలంక
- జేసన్ హోల్డర్ - వెస్టిండీస్
- టిమ్ సౌథీ - న్యూజిలాండ్
బేస్ ప్రైజ్ రూ. 1కోటి ప్లేయర్లు..
- డారిల్ మిచెల్ - న్యూజిలాండ్
- ఆస్టన్ ఏగర్ - ఆస్ట్రేలియా
- డీఆర్సీ షాట్ - ఆస్ట్రేలియా
- ఆస్టన్ టర్నర్ - ఆస్ట్రేలియా
- గాస్ అట్కిసన్ - ఇంగ్లాండ్
- శామ్ బిల్లింగ్స్ - ఇంగ్లాండ్
- ఆడమ్ మిల్నే - న్యూజిలాండ్
- వెయిన్ పార్నెల్ - సౌతాఫ్రికా
- డ్వెన్ ప్రిటోరియస్ - సౌతాఫ్రికా
- అల్జారీ జోసెఫ్ - వెస్టిండీస్
- రోమన్ పావెల్ - వెస్టిండీస్
- డేవిడ్ వీస్ - సౌతాఫ్రికా
ఇక వీళ్లే కాకుండా రూ. 1 కోటి కంటే తక్కువ బేస్ ప్రైజ్ ఉన్న ఆటగాళ్లు కూడా వేలంలో అందుబాటులో ఉన్నారు. అందులో ముఖ్యంగా రచిన్ రవీంద్రపై ఎక్కువ ఫోకస్ ఉంది. అయితే అతడి బేస్ ప్రైజ్ రూ. 50 లక్షలుగా ఉంది. కానీ, అతడు వేలంలో పాత రికార్డులన్నీ బ్రేక్ చేసి. అత్యధిక ధరకు అమ్ముడైనా ఆశ్చర్యం లేదు.
-
A total of 1166 players have enlisted for the IPL 2024 mini-auction, exceeding the player count from the IPL mega-auction in 2022. pic.twitter.com/F9DxqatYhL
— CricTracker (@Cricketracker) December 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">A total of 1166 players have enlisted for the IPL 2024 mini-auction, exceeding the player count from the IPL mega-auction in 2022. pic.twitter.com/F9DxqatYhL
— CricTracker (@Cricketracker) December 2, 2023A total of 1166 players have enlisted for the IPL 2024 mini-auction, exceeding the player count from the IPL mega-auction in 2022. pic.twitter.com/F9DxqatYhL
— CricTracker (@Cricketracker) December 2, 2023
వారం రోజుల్లో డబ్ల్యూపీఎల్ వేలం- 165 మందిలో అదృష్టం వరించేది ఎవరినో?
1166 ప్లేయర్లు - 77 పొజిషన్లు - ఈ మినీ వేలానికి చాలా డిమాండ్ గురూ