ETV Bharat / sports

మహిళల టీ20 ఛాలెంజ్​​: తొలిమ్యాచ్​ మిథాలీ సేనదే - మహిళల టీ20 ఛాలెంజ్​ వార్తలు

యూఏఈ వేదికగా ఈ ఏడాది మహిళల టీ20 ఛాలెంజ్​ ప్రారంభమైనంది. తొలి మ్యాచ్​లో సూపర్​నోవాస్​పై వెలాసిటీ జట్టు విజయం సాధించింది. 127 పరుగుల లక్ష్యాన్ని మరో బంతి మిగిలుండగానే పూర్తి చేసింది.

Women's T20 Challenge 2020: Velocity beats Supernovas by 5 wickets in thriller
మహిళల టీ20 ఛాలెంజ్​​: తొలిమ్యాచ్​ మిథాలీసేనదే
author img

By

Published : Nov 4, 2020, 11:30 PM IST

ఉమెన్స్​ టీ20 ఛాలెంజ్​లో తొలి మ్యాచ్​ ఉత్కంఠభరితంగా సాగింది. షార్జా వేదికగా సాగిన ఈ మ్యాచ్‌లో మిథాలీరాజ్​ కెప్టెన్​గా వ్యవహరిస్తున్న వెలాసిటీ అదరగొట్టింది. హర్మన్​ప్రీత్​ కౌర్​ కెప్టెన్​గా వ్యవహరిస్తోన్న డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సూపర్‌నోవాస్‌ను అయిదు వికెట్ల తేడాతో వెలాసిటీ టీమ్​ మట్టికరిపించింది.

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హర్మన్‌ప్రీత్‌ సేన ఎనిమిది వికెట్లకు 126 పరుగులు చేసింది. చామరి (44) టాప్‌ స్కోరర్‌. అనంతరం బరిలోకి దిగిన వెలాసిటీ 19.5 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సునే లాస్ (37*) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.