ETV Bharat / sports

కేఎల్​ రాహుల్​ లక్ష్యంగా ముంబయి వ్యూహం! - shane bond about kl rahul batting

పంజాబ్​ను ఓడించేందుకు నిర్దిష్ట ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు ముంబయి ఇండియన్స్​ బౌలింగ్​ కోచ్​ షేన్​ బాండ్​ తెలిపాడు. గురువారం ఇరు జట్ల మధ్య మ్యాచ్​ జరగనుంది.

KL Rahul
కేఎల్​ రాహుల్
author img

By

Published : Oct 1, 2020, 11:54 AM IST

పంజాబ్​ జట్లును ఓడించేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించామని ముంబయి ఇండియన్స్ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ చెప్పాడు. ముఖ్యంగా కెప్టెన్​, ఓపెనర్​ కేఎల్​ రాహుల్​ను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపాడు. అబుదాబి వేదికగా పంజాబ్​తో గురువారం తలపడనుంది ముంబయి జట్టు. ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్​ల్లో 222 పరుగులు చేసిన రాహుల్ ఆరెంజ్​ క్యాప్​ సొంతం చేసుకున్నాడు.

"రాహుల్​ గత కొన్ని మ్యాచ్​ల్లో మాకు పోటీగా పరుగులు సాధించాడు. ఎంతో అద్భుతమైన ఆటగాడు అతడు. ఈ రోజు మధ్యాహ్నం బౌలర్లందరితో సమావేశం ఏర్పాటు చేయనున్నాం. కచ్చితంగా ప్రత్యర్థి జట్టును మట్టికరిపించేందుకు తగ్గట్లు ప్రణాళికలు సిద్ధం చేస్తాం. రాహుల్​ మిడిల్​ ఓవర్లలో దూకుడుగా ఆడతాడని తెలుసు. తన తోటి బ్యాట్స్​మన్​పై మా బౌలర్లు ఒత్తిడి పెంచొచ్చు"

షేన్​ బాండ్​, ముంబయి బౌలింగ్​ కోచ్​

గత మ్యాచ్​లో బెంగళూరు చేతిలో ముంబయి ఓడిపోయింది. పంజాబ్​ కూడా రాజస్థాన్​ ముందు తలవంచక తప్పలేదు. ఇప్పుడు ఈ రెండు జట్లు ఎలాగైనా గెలుపు సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉన్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పంజాబ్ ఐదో స్థానంలో ఉండగా.. ముంబయి ఆరో స్థానంలో కొనసాగుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.