ETV Bharat / sports

హైదరాబాద్​ అద్భుత విజయం.. ఆశలు సజీవం

author img

By

Published : Oct 22, 2020, 11:22 PM IST

రాజస్థాన్​పై గెలిచిన హైదరాబాద్.. ఫ్లేఆఫ్ అవకాశాల్ని మెరుగుపరుచుకుంది. మనీశ్ పాండే, విజయ్ శంకర్​ అర్థ శతకాలతో హైదరాబాద్​కు విజయాన్ని అందించారు. పాయింట్ల పట్టికలో హైదరాబాద్​ ఐదో స్థానానికి చేరుకుంది.​

SRH vs RR
హైదరాబాద్​ అద్భుత విజయం.. పాయింట్ల పట్టికలో పైపైకి

రాజస్థాన్​పై హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మనీశ్ పాండే చెలరేగడం వల్ల లక్ష్యాన్ని మరో రెండు ఓవర్లు మిగిలుండగానే పూర్తి చేసింది. ఫలితంగా పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుని, ఫ్లేఆఫ్ అవకాశాల్ని మెరుగుపరుచుకుంది.

155 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన హైదరాబాద్.. మూడు ఓవర్లలోపే ఓపెనర్లు వార్నర్, బెయిర్ స్టో వికెట్లో కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన మనీశ్ పాండే (83), విజయ్ శంకర్(52) సంయమనంతో ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ప్రత్యర్థి బౌలర్లకు వికెట్ తీసే అవకాశం ఇవ్వకుండా లాంఛనాన్ని పూర్తి చేశారు. రాజస్థాన్ బౌలర్ ఆర్చర్​కు రెండు వికెట్లు దక్కాయి.

అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన రాజస్థాన్.. ధాటిగానే ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. కానీ ఉతప్ప ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన శాంసన్.. స్టోక్స్​తో కలిసి ఇన్నింగ్స్​ను చక్కదిద్దే బాధ్యతను తీసుకున్నాడు. కానీ కొద్ది బంతుల తేడాతో వీరిద్దరూ పెవిలియన్​ చేరారు.

ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్​మెన్​లో అందరూ స్వల్ప స్కోర్లకే పరిమితమయ్యారు. నిర్ణీత ఓవర్లన్నీ ఆడి 6 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేయగలిగింది. హైదరాబాద్ బౌలర్లలో హోల్డర్ 3, రషీద్ ఖాన్, విజయ్ శంకర్ తలో వికెట్ పడగొట్టారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.