ఈ సీజన్లో దిల్లీ క్యాపిటల్స్ తుది జట్టులో స్టార్ క్రికెటర్ అజింక్య రహానెకు స్థానం కల్పించాలని ఫ్రాంచైజీకి అభిమానులు, నెటిజన్లు చాలా విజ్ఞప్తి చేస్తున్నారు. ఓపెనర్‌గా ధావన్ పేలవమైన ప్రదర్శన చేస్తున్నాడని, బదులుగా రహానెను పంపించాలని అంటున్నారు. "ప్రస్తుతం ఈ విషయమై ఏమీ ఆలోచించట్లేదు. రహానె తనవంతు వచ్చే వరకు వేచి ఉండాలి" అని దిల్లీ ఫ్రాంచైజీ అధికారులు చెప్పారు.
"రహానె గొప్ప ఆటగాడు. కానీ నెటిజన్ల విజ్ఞప్తిని ప్రామాణికం చేసుకుని తుది జట్టులో ఆటగాళ్లను మేం ఎంచుకోము. ధావన్- పృథ్వీ షా భాగస్వామ్యం బాగుంది. వారిపై నమ్మకం ఉంది. కాబట్టి రహానె తనవంతు వచ్చే వరకు వేచి ఉండాలి. అతనెప్పడు మా జట్టులో అంతర్భాగమే. టోర్నీ మధ్యలో కూడా అతడిని వేరే ఫ్రాంచైజీకీ బదిలీ చేయాలని అనుకోవట్లేదు.
-దిల్లీ క్యాపిటల్స్ అధికారి
రహానెను ఓపెనర్‌గా కాకపోయిన మిడిల్ ఆర్డర్‌లోనైనా పంపాలని అభిమానులు డిమాండ్ చేశారు. దీనిపై యాజమాన్యం చర్చలు జరుపుతోందని సదరు అధికారి అన్నారు. కానీ అతడిని ఆ స్థానంలో పంపడం సరైనది కాదని అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి పాంటింగ్ రికార్డ్ సమం.. ఆస్ట్రేలియా మహిళా జట్టు ఘనత