అబుదాబి వేదికగా మరో రసవత్త పోరుకు రంగం సిద్ధమైంది. పది మ్యాచుల్లో ఏడు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ముంబయి ఇండియన్స్.. ఏడింటిలో ఓడి, ఏడో స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి, జోరును కొనసాగించాలని రోహిత్ సేన, ప్లే ఆఫ్స్ అవకాశాలను పదిలం చేసుకోవాలని(కనీసం రన్‌రేట్‌ను మెరుగుపరుచుకోనైనా) స్మిత్ బృందం పట్టుదలతో ఉన్నాయి. మరి ఎవరు గెలుస్తోరో?
ఫామ్ కొనసాగిస్తే విజయమే!
గత మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ లేకుండానే బరిలో దిగిన ముంబయి.. చెన్నైపై సునాయస విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు ఇషాన్ కిషాన్, డికాక్ మ్యాచ్‌ను ముగించేశారు. మిడిలార్డర్లో సూర్యకుమార్ యాదవ్(243), హార్దిక్ పాండ్య(164), పొలార్డ్(208), కృనాల్ పాండ్య(82) ఇప్పటికే ఫామ్‌లో ఉన్నారు. జట్టు విజయాల్లో కీలకపాత్ర వహిస్తున్నారు. బౌలింగ్ విభాగంలో బౌల్ట్, బుమ్రా అద్భుతంగా రాణిస్తున్నారు. కౌల్టర్ నైల్, కృనాల్, చాహర్ కూడా బాగానే ఆడుతున్నారు. ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే రాయల్స్‌పై గెలుపు నల్లేరపై నడకే.
ఏమో చెప్పలేం
లీగ్ ప్రారంభంలో గెలిచినప్పటికీ.. ఆ తర్వాత నిలకడలేని ప్రదర్శన చేస్తూనే ఉంది రాజస్థాన్. స్టోక్స్(110), శాంసన్(272), బట్లర్(271) లాంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నాసరే గెలవలేకపోతోంది. మిడిల్ ఆర్డర్ సమస్య వెంటాడుతోంది. ఆల్‌రౌండర్ రాహుల్ తివాతియా(224, 7వికెట్లు) బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ బాగానే రాణిస్తున్నా అతడికి సహకారం అందట్లేదు. బౌలర్లలోనూ నిలకడ లోపిస్తోంది.
ఆర్చర్(15) వికెట్లు బాగానే తీస్తున్నా.. కార్తీక్ త్యాగి, ఉనద్కత్, అంకిత్ రాజ్‌పుత్ నుంచి సహకారం లభించట్లేదు. వీళ్లు మెరుగ్గా ఆడాల్సి ఉంది. ఇకపై ఆడే ప్రతి మ్యాచ్‌లో అదృష్టం కలిసొచ్చి రన్‌రేట్ మెరుగై, అవతలి జట్లు చిత్తుగా ఓడిపోతే.. పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకి ప్లే ఆఫ్స్‌కు వెళ్లే అవకాశం ఉంది. లేదంటే అంతే!
జట్లు (అంచనా)
ముంబయి: డి కాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ(సారథి), హార్దిక్ పాండ్య, పొలార్డ్ , కృనాల్ పాండ్య, కౌల్టర్‌నీల్, రాహుల్ చాహర్, బౌల్ట్, బుమ్రా
రాజస్థాన్ : బట్లర్, స్టోక్స్, సంజూ శాంసన్, కార్తిక్ త్యాగి, స్మిత్ (కెప్టెన్), శ్రేయస్ గోపాల్, రాహుల్ తెవాతియా, జయదేవ్ ఉనద్కత్, రియాన్ పరాగ్, రాబిన్ ఉతప్ప, జోఫ్రా ఆర్చర్
ఇదీ చూడండి 'గేల్ చాలా స్మార్ట్.. అతడుంటే ఎనర్జీ పక్కా'