ఐపీఎల్లో భాగంగా దుబాయ్ వేదికగా నేడు ముంబయి ఇండియన్స్‌తో దిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. కీలకమైన ఈ పోరుకు కూడా ముంబయి సారథి రోహిత్‌శర్మ అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. ఇప్పటికే ఆ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకోవడం వల్ల ముందుజాగ్రత్తగా హిట్‌మ్యాన్‌కు మరింత విశ్రాంతి ఇస్తున్నారని తెలుస్తోంది.
తొడ కండరాలు పట్టేసిన కారణంగా రోహిత్‌శర్మ గత మూడు మ్యాచుల్లో ఆడలేదు. అతడి స్థానంలో సీనియర్ ఆటగాడు కీరన్ పొలార్డ్ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. వారం రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్న రోహిత్ కోలుకుని నెట్స్‌లో సాధన చేస్తున్నాడు. వేగంగా కదులుతున్నాడు. అయినప్పటికీ అతడిని ఆడించకూడదని ముంబయి యాజమాన్యం నిర్ణయించిందని సమాచారం. ఇప్పుడే తొందరపడి ఆడిస్తే ప్లేఆఫ్స్‌లో ఇబ్బంది రావొచ్చని భావిస్తున్నారని తెలిసింది. ముందు జాగ్రత్తగా అతడికి మరికొన్ని రోజులు విశ్రాంతి ఇవ్వాలని అనుకుంటున్నారని జట్టు వర్గాల భోగట్టా.
ప్రస్తుతానికి డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయికి ఎలాంటి ఇబ్బంది లేదు. 16 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు మరో రెండు మ్యాచులు ఆడాల్సి ఉంది. శనివారం మధ్యాహ్నం దుబాయ్ వేదికగా దిల్లీతో తలపడనుంది. మళ్లీ మంగళవారం షార్జాలో హైదరాబాద్‌తో పోరాడనుంది. ఈ రెండింట్లోనూ గెలిచి పట్టికలో ఇలాగే అగ్రస్థానంలో కొనసాగాలని ముంబయి పట్టుదలతో ఉంది. ఎందుకంటే తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లకు నాకౌట్స్‌లో ఓడినా ఫైనల్ చేరేందుకు మరో అవకాశం దొరుకుతుంది.