ETV Bharat / sports

ముంబయిపై పంజాబ్ 'డబుల్​​ సూపర్'​ విజయం - KXIP dream eleven team

KXIP won the toss and elected to bat first
టాస్ గెలిచిన ముంబయి.. పంజాబ్ బ్యాటింగ్
author img

By

Published : Oct 18, 2020, 7:02 PM IST

Updated : Oct 19, 2020, 12:25 AM IST

00:14 October 19

రెండో సూపర్‌ ఓవర్‌కు దారితీసిన మ్యాచ్‌లో ముంబయిపై పంజాబ్‌ విజయం సాధించింది. 

00:07 October 19

పంజాబ్‌ లక్ష్యం 12 పరుగులు

రెండో సూపర్‌ ఓవర్​లో ముంబయి 6 బంతుల్లో 11 పరుగులు చేసింది. దీంతో పంజాబ్‌ లక్ష్యం 6 బంతుల్లో 12గా మారింది. 

23:41 October 18

సూపర్‌ఓవర్‌: ముంబయి 6 బంతుల్లో 5 పరుగులు చేసింది. దీంతో పంజాబ్‌ విధించిన 6 పరుగుల లక్ష్యాన్ని ముంబయి చేధించలేకపోవడం వల్ల సూపర్‌ఓవర్‌ కూడా టై అయింది.  

23:38 October 18

సూపర్‌ఓవర్‌: పంజాబ్‌ జట్టు 6 బంతుల్లో 5 పరుగులు చేసింది.దీంతో ముంబయి లక్ష్యం 6 బంతుల్లో 6గా మారింది.

23:18 October 18

ఉత్కంఠగా సాగిన పంజాబ్‌×ముంబయి మ్యాచ్‌ టైగా‌ ముగిసింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పంజాబ్​ నిర్ణీత ఓవర్లలో అవే పరుగులు చేసింది. దీంతో సూపర్ ఓవర్​ ద్వారా ఫలితం తేలనుంది.

23:08 October 18

పంజాబ్​ ఐదో వికెట్​ కోల్పోయింది. సారథి కేఎల్​ రాహుల్​ (77) ఔటయ్యాడు. క్రీజులో దీపక్​ హోడా(14), క్రిస్ జోర్డాన్​(1) ఉన్నారు. 18.2 ఓవర్లు పూర్తయ్యేసరికి 161 పరుగులు చేసింది పంజాబ్​. పది బంతుల్లో 16పరుగులు అవసరం.

23:03 October 18

17 ఓవర్లు పూర్తయ్యేసరికి పంజాబ్​ నాలుగు వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్​(77), దీపక్​ హోడా(13) నిలకడగా ఆడుతోన్నారు. విజయానికి 18 బంతుల్లో 27 పరుగులు అవసరం

22:46 October 18

పంజాబ్​ ఐదో వికెట్​ కోల్పోయింది. దీంతో  15 ఓవర్లు పూర్తయ్యేసరికి  125 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్‌ (61) , దీపక్ హుడా (2) జాగ్రత్తగా ఆడుతున్నారు. 

22:37 October 18

 బుమ్రా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన పూరన్‌ (24) కౌల్టర్‌నైల్ చేతికి చిక్కాడు. దీంతో 12.5 ఓవర్లకు పూర్తయ్యేసరికి పంజాబ్‌ మూడు వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది.

22:17 October 18

పంజాబ్​ జట్టు రెండో వికెట్​ కోల్పోయింది. చాహర్​ బౌలింగ్​లో గేల్​(24) బౌల్ట్​ చేతికి క్యాచ్​ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో పది ఓవర్లకు 87 పరుగలు చేసింది. క్రీజులో నికోలస్​ పూరణ్​ వచ్చాడు. రాహుల్​(38) జాగ్రత్తగా ఆడుతోన్నాడు. 

21:57 October 18

ఆరు ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్​ నష్టానికి 51పరుగులు చేసింది పంజాబ్​ జట్టు. క్రీజులో సారథి రాహుల్​(32), గేల్​(7) జాగ్రత్తగా ఆడుతోన్నారు. 

21:35 October 18

నిలకడగా పంజాబ్ బ్యాటింగ్

177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్​ రెండు ఓవర్లకు 13 పరుగులు చేసింది. రాహుల్ (3), మయాంక్ అగర్వాల్ (10) నిలకడగా ఆడుతున్నారు. 

21:08 October 18

పంజాబ్ లక్ష్యం 177

పంజాబ్​తో జరుగుతోన్న మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లకు ఆరు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. రోహిత్ (9), సూర్యకుమార్ (0), ఇషాన్ కిషన్ (7), హార్దిక్ పాండ్యా (8) విఫలమయ్యారు. డికాక్ (53) అర్ధశతకంతో మెరవగా, కృనాల్ పాండ్యా 38 పరుగులతో రాణించాడు. చివర్లో పొలార్డ్ (34, 12 బంతుల్లో), కౌల్టర్​నీల్ (24, 12 బంతుల్లో) మెరుపు ఇన్నింగ్స్ కారణంగా ముంబయి 176 పరుగులకు పరిమితమైంది. 

20:45 October 18

తడబడుతోన్న ముంబయి

16 ఓవర్లు ముగిసేసరికి ముంబయి ఇండియన్స్ 5 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. డికాక్ (52) ఒక్కడే అర్ధశతకంతో నిలకడగా ఆడుతున్నాడు. కృనాల్ పాండ్యా 34 పరుగులు చేసి పర్వాలేదనిపించగా.. హార్దిక్ పాండ్యా 8 పరుగులకే పెవిలియన్ చేరాడు.

20:13 October 18

నిలకడగా ముంబయి బ్యాటింగ్

9 ఓవర్లకు 60 పరుగులు చేసింది ముంబయి. డికాక్ (26), కృనాల్ పాండ్యా (16) నిలకడగా ఆడుతున్నారు. 

19:55 October 18

మూడు వికెట్లు కోల్పోయిన ముంబయి

పంజాబ్​తో జరుగుతోన్న మ్యాచ్​లో ముంబయి మూడు వికెట్లు కోల్పోయింది. రోహిత్ (9), సూర్యకుమార్ యాదవ్ (0), ఇషాన్ కిషన్ (7) విఫలమయ్యారు. ప్రస్తుతం 5.1 ఓవర్లకు 38 పరుగులు చేసింది ముంబయి. 

19:37 October 18

దూకుడుగా ముంబయి

పంజాబ్​తో జరుగుతోన్న మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేస్తోన్న మంబయి జోరుగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. రెండు ఓవర్లకు 15 పరుగులు చేసింది. రోహిత్ (9), డికాక్ (6) క్రీజులో ఉన్నారు. 

19:06 October 18

 జట్లు

ముంబయి ఇండియన్స్

రోహిత్ శర్మ (కెప్టెన్), డికాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, నాథన్ కౌల్టర్​నీల్, రాహుల్ చాహర్, బౌల్ట్, బుమ్రా

కింగ్స్ ఎలెవన్ పంజాబ్

కేఎల్ రాహుల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, నికోలస్ పూరన్, మ్యాక్స్​వెల్, దీపక్ హుడా, క్రిస్ జోర్డాన్, మురుగన్ అశ్విన్, షమీ, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్

18:43 October 18

ముంబయి బ్యాటింగ్

పాయింట్ల పట్టికలో తొలి, చివరి స్థానాల్లో ఉన్న జట్ల మధ్య నేడు మ్యాచ్​ జరగనుంది. ముంబయి ఇండియన్స్​తో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తలపడనుంది. ఈ మ్యాచ్​లో గెలిస్తే రోహిత్ బృందం ఫ్లే ఆఫ్​లో చోటు ఖరారు చేసుకున్న మొదటి జట్టుగా నిలుస్తుంది. పంజాబ్ ఓడితే రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా అప్రతిష్ఠ మూట గట్టుకుంటుంది. ఈ మ్యాచ్​లో మొదట టాస్ గెలిచిన ముంబయి బ్యాటింగ్ ఎంచుకుంది.

Last Updated : Oct 19, 2020, 12:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.