ETV Bharat / sports

ఐపీఎల్​లో సచిన్ రికార్డు అధిగమించిన​ రాహుల్ - కేఎల్ రాహుల్​ వార్తలు

ఆర్సీబీతో మ్యాచ్​లో పంజాబ్ కెప్టెన్ కేఎల్​ రాహుల్​ రెండు రికార్డులు సాధించాడు. ప్రస్తుత సీజన్​లో తొలి సెంచరీ చేసిన బ్యాట్స్​మన్​గా.. తక్కువ సమయంలో 2 వేల పరుగుల పూర్తి చేసిన భారత క్రికెటర్​గా నిలిచాడు.

KL Rahul Becomes Fastest Indian To Score 2000 IPL Runs, Breaks Sachin Tendulkar's Record
ఆర్సీబీతో మ్యాచ్​లో కేఎల్​ రాహుల్​ రెండు ఘనతలు
author img

By

Published : Sep 25, 2020, 2:43 PM IST

Updated : Sep 25, 2020, 6:00 PM IST

బెంగళూరుతో గురువారం జరిగిన మ్యాచ్​లో పంజాబ్​ కెప్టెన్​ కేఎల్​ రాహుల్​ విధ్వంసక బ్యాటింగ్​ చేశాడు. ఈ క్రమంలోనే రెండు రికార్డులను నమోదు చేశాడు. కేవలం 69 బంతుల్లో 132 (14 ఫోర్లు, 7 సిక్సర్లు) పరుగులు చేసి.. ఈ సీజన్​లో తొలి సెంచరీ చేసిన బ్యాట్స్​మన్​గా నిలిచాడు. మరో రికార్డును సృష్టించాడు.

సెంచరీతో చెలరేగిన రాహుల్..​ ఐపీఎల్​​లో 2 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. టోర్నీలో ఈ ఘనతను వేగంగా చేరుకున్న భారత బ్యాట్స్​మన్​గా నిలిచాడు. గతంలో ముంబయి ఇండియన్స్​ ఆటగాడు సచిన్​ (63 ఇన్నింగ్స్​) రికార్డును రాహుల్​ (60 ఇన్నింగ్స్​) అధిగమించాడు.

ఈ మ్యాచ్​లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్​.. నిర్ణీత ఓవర్లలో 206 పరుగులు చేసింది. ఛేదనలో బెంగళూరు 17 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌటైంది. పంజాబ్​ తర్వాతి మ్యాచ్​ను రాజస్థాన్​​తో(సెప్టెంబరు 27న), ఆర్సీబీ ముంబయి ఇండియన్స్​తో(సెప్టెంబరు 28న) తలపడనుంది.

Last Updated : Sep 25, 2020, 6:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.