ETV Bharat / sports

హైదరాబాద్​పై దిల్లీ ప్రతీకారం తీర్చుకుంటుందా? - ipl 2020 updates

మంగళవారం(అక్టోబర్​ 27) జరిగే మ్యాచ్​లో దిల్లీ, హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి​. భారత కాలమాన ప్రకారం రాత్రి 7.30 గంటలకు పోరు ప్రారంభం కానుంది. మరి ఎవరు గెలుస్తారో?

IPL PREVIEW
సన్​రైజర్స్​పై దిల్లీ
author img

By

Published : Oct 27, 2020, 5:30 AM IST

దాదాపు ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన సన్​రైజర్స్​ హైదరాబాద్.. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న దిల్లీతో తలపడనుంది. దుబాయ్​ వేదికగా ఈ పోరు జరగనుంది. గత మ్యాచ్​లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని దిల్లీ భావిస్తోంది. మరోవైపు ఇందులో గెలిచి పరువు నిలుపుకోవాలని వార్నర్​ సేన అనుకుంటోంది.

ఓడిపోతుందా.. గెలుస్తుందా?

లీగ్​ ప్రారంభం నుంచి అదరగొడుతున్న దిల్లీ​.. గత రెండు మ్యాచ్​ల్లోనూ పేలవ ప్రదర్శన చేసి నిరాశ పరిచింది. వరుసగా రెండు సెంచరీలు బాదిన ధావన్​, కోల్​కతాతో మ్యాచ్​లో దారుణంగా విఫలమయ్యాడు. కెప్టెన్ శ్రేయస్​ అయ్యర్​, పంత్​లో నిలకడ లోపిస్తోంది. మిగత వారు విఫలమవుతున్నారు. బౌలింగ్​లో అన్రిచ్, స్టొయినిస్​, అశ్విన్​, రబాడా బాగానే ఆడుతున్నప్పటికీ బ్యాట్స్​మెన్ నుంచి సహకారం అందట్లేదు.

ఏమో కష్టమే!

లీగ్ ప్రారంభం నుంచి అస్థిర ప్రదర్శన చేసిన హైదరాబాద్.. ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసును దాదాపుగా తప్పుకుంది. వార్నర్​, బెయిర్​ స్టో, మనీశ్​ పాండే, విజయ్​ శంకర్​ ఓ మ్యాచ్​లో అదరగొడితే మరో పోరులో తేలిపోతున్నారు. బౌలర్లలో హోల్డర్​, రషీద్​ ఖాన్​, నటరాజన్​ కూడా అంతే. కానీ ఈ సీజన్​లో​ ఇంతకముందు ఓడించినట్లే దిల్లీని మరోసారి ఓడించాలని భావిస్తోంది.

జట్లు (అంచనా)

హైదరాబాద్​ : డేవిడ్​ వార్నర్​ (కెప్టెన్​), బెయిర్​స్టో, విలియమ్సన్​, మనీశ్​ పాండే, ప్రియమ్​ గార్గ్​, విజయ్ శంకర్, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్​, ఖలీల్​ అహ్మద్​, సందీప్​ శర్మ, నటరాజన్​

దిల్లీ క్యాపిటల్స్ : ​శిఖర్ ధావన్, అజింక్య రహానె, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రిషబ్ పంత్, స్టోయినిస్, హెట్​మెయిర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రబాడ, తుశార్ దేశ్​పాండే, అన్రిచ్

ఇదీ చూడండి 'స్టోక్స్​, శాంసన్ ఇన్నింగ్స్ అద్భుతం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.