ఆటల్లో ఓ జట్టుపై మరో జట్టు ప్రతిసారీ ఆధిపత్యం చెలాయించే సందర్భాలు చూస్తూనే ఉంటాం. ఐసీసీ వన్డే ప్రపంచకప్ టోర్నీల్లో దాయాది పాక్‌పై భారత్‌ది ఓటమెరుగని చరిత్ర. ఎప్పుడు తలపడ్డా సరే టీమ్‌ఇండియా రెచ్చిపోతుంది. ప్రత్యర్థిని చిత్తుచేస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న పొట్టి క్రికెట్ లీగులోనూ అలాంటి ఆసక్తికర శత్రుత్వాలు ఉన్నాయి. ఆధిపత్యాలూ ఉన్నాయి.
అబుదాబి వేదికగా బుధవారం, డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి, కోల్‌కతా తలపడ్డాయి. రోహిత్ (80), సూర్యకుమార్ (47) చెలరేగి ఆడటం వల్ల ఆ జట్టు 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఛేదనలో కోల్‌కతా.. 9 వికెట్ల నష్టానికి 146 పరుగులే చేసింది. 49 పరుగుల తేడాతో ఘోరంగా ఓడింది.
ఈ రెండు జట్లకు ఇది 26వ మ్యాచ్. ఇందులో ముంబయి ఏకంగా 20సార్లు గెలిచింది. చివరి 11 మ్యాచుల్లోనూ 10 సార్లు విజయం సాధించింది. అంటే కోల్‌కతాపై రోహిత్ సేన ఆధిపత్యం ఎలాంటిదో తెలుస్తోంది. లీగ్‌లో ఓ జట్టుపై అత్యధిక విజయాలు సాధించిన జట్టూ ముంబయే. ఈ రికార్డులో తర్వాతి స్థానం కోల్‌కతాది. ఇప్పటి వరకు పంజాబ్‌పై ఆ జట్టు 17 విజయాలు అందుకుంది. ఇక చెన్నైపై 17, బెంగళూరుపై 16 విజయాల ఘనత ముంబయిదే. ధోనీ సేనా తక్కువేమీ కాదు. దిల్లీ, బెంగళూరుపై తలో 15సార్లు విజయ దుందుభి మోగించింది.
ఇవీ చదవండి: