ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. మరో 86 పరుగులు చేస్తే.. ఐపీఎల్లో ముంబయి తరఫున 4 వేల పరుగుల మార్కును చేరుకుంటాడు. మంగళవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో ఈ మైలురాయిని అందుకోవాలని పట్టుదలతో ఉన్నాడు రోహిత్. అంతకుముందు డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించాడు హిట్‌మ్యాన్.
ఇప్పటివరకు ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో సమంగా చెరో పది గెలిచాయి. అయితే, ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే ముంబయి జట్టు బలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. మరోవైపు రాబిన్ ఉతప్ప, ఉనద్కత్ పేలవ ప్రదర్శన, స్టోక్స్ క్వారంటైన్లో ఉండటం రాజస్థాన్‌కు ఆందోళన కలిగించే విషయం.
వరుసగా రెండు విజయాలతో దూసుకెళ్తోన్న ముంబయి.. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ను ఓడించి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. మరి ఎవరి వ్యూహం ఫలించనుందో చూడాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.