ETV Bharat / sports

ఐపీఎల్​ 13 : కోహ్లీని వెంటాడుతోన్న దురదృష్టం!

ఈ ఐపీఎల్​లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సారథి కోహ్లీని దురదృష్టం వెంటాడుతోంది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్​ల్లో రెండు గెలిచినా.. కోహ్లీ మాత్రం మూడింటిలోనూ ఘోరంగా విఫలమయ్యాడు. పేలవమైన ప్రదర్శనతో ఇప్పటివరకు కేవలం 17పరుగులు మాత్రమే చేసి అభిమానులను నిరాశ పరిచాడు.

Kohli's
కోహ్లీ
author img

By

Published : Sep 29, 2020, 4:54 PM IST

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు.. ఈ ఐపీఎల్​లో ఆడిన తొలి మూడు మ్యాచ్​ల్లో అదృష్టం కొద్దీ రెండింటిలో విజయం సాధించింది. అయితే సారథి కోహ్లీని మాత్రం దురదృష్టం వెంటాడుతుందనే చెప్పాలి. మూడు మ్యాచుల్లోనూ ఘోరంగా విఫలమై అభిమానులకు నిరాశే మిగులుస్తున్నాడు.

తొలి మ్యాచ్​ సన్​రైజర్స్​పై ఆర్సీబీ విజయం సాధించినా.. ఇందులో కోహ్లీ కేవలం 14పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత పంజాబ్​పై ఒక పరుగు చేసి దారుణంగా విఫలమయ్యాడు. కాగా, ఇదే మ్యాచ్​లో ఓవర్లు నెమ్మదిగా వేసినందుకు అతడిపై ఏకంగా రూ.12లక్షల జరిమానా విధించారు లీగ్​ అధికారులు. అనంతరం మంబయితో జరిగన పోరులో మూడు పరుగులే చేయగలిగాడు. మొత్తంగా ఇప్పటివరకు 17 పరుగులే చేసి అభిమానులను నిరాశపరిచాడు.

Kohli's
కోహ్లీ

అయితే దీనిపై స్పందించిన కోహ్లీ చిన్ననాటి కోచ్​ రాజ్​కుమార్ శర్మ.. "ఆటలో మంచి, చెడు రోజులు ఉంటాయి. అతడు యంత్రం కాదని, అందరిలాగానే మనిషి అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అతడో గొప్ప ఆటగాడు. త్వరలోనే బాగా ఆడతాడు. అభిమానులు నిరుత్సాహపడకండి" అని అన్నాడు.

Kohli's
కోహ్లీ

ఇదీ చూడండి బేబీ.. నేనెంతో గర్వపడుతున్నా: ఇషాన్ ప్రేయసి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.