ETV Bharat / sports

కోహ్లీ, జడేజా క్యాచ్​లు వదిలేయడానికి ఆ లైట్లే కారణం! - latest ipl news updates

ఈ ఐపీఎల్​లో చాలా మంది మేటి ఫీల్డర్లు క్యాచ్​లు మిస్​ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. వాటి వల్ల మ్యాచ్​ ఫలితాలే మారిపోతున్నాయి. ఈ క్రమంలోనే అసలు అలా క్యాచ్​లు వదిలేయడానికి కారణమేంటని అడగ్గా.. మైదానంలో ఉన్న ఫ్లడ్​ లైట్లేనని అంటున్నారు ఆటగాళ్లు.

flood lights
ఐపీఎల్​
author img

By

Published : Oct 7, 2020, 8:01 AM IST

ఈ ఏడాది ఐపీఎల్‌లో జడేజా, కోహ్లీ లాంటి మేటి ఫీల్డర్లు సులువైన క్యాచ్‌లు వదిలేయడం చూశాం. దుబాయ్‌లో జరుగుతున్న ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో ఎన్నో క్యాచ్‌లు ఇలాగే నేలపాలవుతున్నాయి. వాటి వల్ల మ్యాచ్‌ల ఫలితాలే మారిపోతున్నాయి. అయితే, మైదానంలో వలయాకారంలో ఉన్న లైట్లే క్యాచ్‌లు చేజారడానికి కారణమంటున్నారు ఆటగాళ్లు.

IPL
కోహ్లీ

మామూలుగా క్రికెట్‌ స్టేడియాల్లో నాలుగు భారీ పోల్స్‌ ద్వారా ఫ్లడ్‌ లైట్లు ఏర్పాటు చేసి స్టేడియంలో వెలుగు తీసుకొస్తారు. కానీ దుబాయ్‌ స్టేడియంలో ఈ విధంగా కాకుండా, వలయాకారంలో ఉండే స్టేడియం పైకప్పు అంచుల్లో ఖాళీ లేకుండా వరుసగా లైట్లు బిగించి ఉంటాయి. అంటే బాగా ఎత్తుకు వెళ్లిన బంతి కోసం తల ఎత్తితే లైట్‌ వెలుతురు కళ్లపై పడుతుండటం వల్ల క్యాచ్‌లు అందుకోవడం కష్టమవుతోంది.

పంజాబ్‌తో మ్యాచ్‌లో కోహ్లీ.. రాహుల్‌ క్యాచ్‌లు రెండు వదిలేయడానికి ఈ లైట్లే కారణమట. తాజాగా చాహల్‌ కూడా ఇలాగే ఓ క్యాచ్‌ వదిలేశాడు. అతడితో పాటు దిల్లీ, చెన్నై కెప్టెన్లు అయ్యర్‌, ధోనీ కూడా ఈ ఇబ్బంది గురించి గళం విప్పారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.