మిడిలార్డర్లో ఆడుతున్నందుకు తానేమీ అనుకోవడం లేదని రాజస్థాన్ విధ్వంసకర ఆటగాడు జోస్ బట్లర్ అన్నాడు. జట్టు అవసరాల మేరకు ఏ స్థానంలోనైనా ఆడతానని పేర్కొన్నాడు. సీజన్ ఆరంభం నుంచి ఓపెనింగ్ చేస్తున్న అతడు బెన్‌స్టోక్స్ రాకతో మిడిలార్డర్‌లో ఆడుతున్నాడు. చెన్నైతో మ్యాచులో 48 బంతుల్లో 70 పరుగులతో అజేయంగా నిలిచాడు.
"ఓపెనింగ్‌తో పోలిస్తే మిడిలార్డర్లో ఆడటం భిన్నంగానే అనిపిస్తుంది. మిడిలార్డర్లో మేం ఎక్కువగా స్పందించాలి. మ్యాచులో ముందు జరిగిన దాన్ని సరిచేయాలి. అయితే జట్టు అవసరాల మేరకు ఏ పాత్ర పోషించేందుకైనా నేను సిద్ధమే" అని బట్లర్ అన్నాడు. అతడు మాట్లాడిన వీడియోను రాజస్థాన్ జట్టు ట్వీట్ చేసింది.
"మాకో మంచి భాగస్వామ్యం అవసరం. రన్ రేటుతో అసలు సమస్యే లేదు. ఎందుకంటే మేం భారీ లక్ష్యాన్ని ఛేదించడం లేదు. అయినప్పటికీ వికెట్లు పడటంతో మేం మంచి భాగస్వామ్యం నెలకొల్పాలనుకున్నాం. ప్రశాంతంగా ఆడాం. జోరు అందుకోగానే ఆటను చెన్నై నుంచి లాగేసుకున్నాం. మేమింకా ఫీల్డింగ్‌ను మెరుగుపర్చుకోవాలి. ఎందుకంటే పేలవమైన ఫీల్డింగ్‌తో 10-15 పరుగులు అదనంగా ఇచ్చాం. చెన్నైపై గెలుపు మాకెంతో అవసరం. జోఫ్రా, శ్రేయస్ గోపాల్, రాహుల్ తెవాతియా చక్కగా బౌలింగ్ చేశారు."
--జోస్ బట్లర్, రాజస్థాన్ జట్టు ఆటగాడు
ఇదీ చూడండి:బట్లర్‌కు ధోనీ కానుక.. ఏంటంటే!