ETV Bharat / sports

షార్జాలో ఉన్నామనుకున్నారు.. అందుకే ఓడిపోయాం!

తమ ఆటగాళ్లు దుబాయ్​ స్టేడియం వాతావరణానికి అలవాటు పడలేదని, టాప్ ఆర్డర్​ త్వరగా ఔటవడం కూడా కోల్​కతాపై ఓటమి ప్రధాన కారణమని స్మిత్ చెప్పాడు.

Steve Smith
స్టీవ్​ స్మిత్​
author img

By

Published : Oct 1, 2020, 10:12 AM IST

వరుస విజయాలతో దూసుకెళ్తున్న రాజస్థాన్​ రాయల్స్​కు బ్రేకులు పడ్డాయి. దుబాయ్​లో కోల్​కతా జట్టు​తో జరిగిన మ్యాచ్​లో 37 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే దుబాయ్ పరిస్థితులకు తమ ఆటగాళ్లు అలవాటు పడలేదని, ఇంకా షార్జాలోేన ఉన్నట్లు భావించారని రాజస్థాన్​ కెప్టెన్​ స్టీవ్​ స్మిత్ చెప్పాడు.​ ఈ క్రమంలోనే టాప్​ ఆర్డర్​ వికెట్లు కోల్పోవడం కూడా ఓటమికి ప్రధాన కారణమని తెలిపాడు. గత మ్యాచ్​లో పంజాబ్​పై 224 పరుగుల లక్ష్య ఛేదనను సులభంగా పూర్తి చేసింది రాజస్థాన్.

Steve Smith
రాజస్థాన్​ vs కోల్​కతా

"ప్రణాళిక ప్రకారం విజయవంతం కాలేకపోయాం. టీ20ల్లో అప్పుడప్పుడూ ఇలా జరుగుతుంది. ముందుగానే వికెట్లు కోల్పోవడం జట్టుకు పెద్ద సమస్య. మాలో కొంతమంది ఇంకా షార్జాలో ఆడుతున్నామని అనుకున్నారు. నిజానికి జట్టు సభ్యులు ఇంకా స్టేడియం వాతావరణానికి అలవాటు పడలేదు"

స్టీవ్​ స్మిత్​, రాజస్థాన్​ రాయల్స్​ కెప్టెన్​

రాజస్థాన్ తర్వాతి మ్యాచ్​ బెంగళూరు జట్టుతో ఆడనుంది. అక్టోబరు 3న భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు మ్యాచ్​ ప్రారంభం కానుంది.

Steve Smith
ఐపీఎల్​ పాయింట్ల పట్టిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.