ETV Bharat / sports

చెన్నై X కోల్​కతా: మూడో విజయంపై కన్నేసిన ఇరుజట్లు - చెన్నై స్క్వాడ్​ టుడే

కింగ్స్​ ఎలెవన్ పంజాబ్​ జట్టుపై విజయంతో పూర్వ వైభవాన్ని తెచ్చుకున్న చెన్నై సూపర్​కింగ్స్​.. లీగ్​ పాయింట్ల పట్టికలో​ టాప్​ స్థానాల్లో చోటును పదిలం చేసుకోవడానికి సిద్ధమైంది. పేలవ ప్రదర్శనతో లీగ్​లో నెట్టుకొస్తున్న కోల్​కతా జట్టులోని ఓపెనర్ల స్థా0నాల్లో కీలక మార్పులు జరిగే అవకాశం ఉంది. ఈ రెండు జట్ల మధ్య నేడు మ్యాచ్ జరగనుంది.

Captain Karthik faces stiffest test as KKR face resurgent CSK
చెన్నై X కోల్​కతా: మూడో విజయంపై కన్నేసిన ఇరుజట్లు
author img

By

Published : Oct 7, 2020, 5:32 AM IST

ప్రస్తుత లీగ్​లో కోల్​కతా నైట్​రైడర్స్​ పేలవ ప్రదర్శనపై ఆ జట్టు అభిమానుల నుంచి విమర్శలు వస్తున్నాయి. కేకేఆర్​ కెప్టెన్ దినేశ్​ కార్తిక్​ బ్యాటింగ్​లో ఆశించినంతగా రాణించకపోవడం వల్ల కెప్టెన్​ పగ్గాలను అతడికి బదులుగా ఇయాన్​ మోర్గాన్​కు అప్పగించాలని సూచనలు వచ్చాయి. కానీ, జట్టు యాజమాన్యం మాత్రం దినేశ్ కార్తిక్​పై పూర్తి విశ్వాసాన్ని ఉంచింది. అతడే జట్టును నడిపిస్తాడని స్పష్టం చేసింది. అయితే చెన్నై సూపర్​కింగ్స్​తో బుధవారం జరిగే మ్యాచ్​లో కెప్టెన్​గా దినేశ్​ కార్తిక్​ తిరిగి రాణిస్తాడా? తనపై యాజమాన్యం పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతాడా? అనే విషయాలపై పలువురు క్రికెట్​ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

కీలక మార్పులు అవసరం

కోల్​కతా నైట్​రైడర్స్​ కెప్టెన్ దినేశ్​ కార్తిక్​ పేలవ ప్రదర్శనతో గత నాలుగు మ్యాచ్​ల్లో కేవలం 37 పరుగులనే రాబట్టగలిగాడు. బ్యాటింగ్​ లైనప్​లో మోర్గాన్​, ఆండ్రూ రస్సెల్​ వంటి హిట్టర్లను కాదని తాను ముందుగా రావడం పట్ల కార్తిక్​పై ఆ జట్టు అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

బిగ్​బాష్​ లీగ్​లో రాణించిన టామ్​ బాంటన్​ను పక్కనపెట్టి ఓపెనర్​గా సునీల్​ నరైన్​ను పంపడంపై ఆ జట్టు అభిమానులు అసహనానికి గురవుతున్నారు. గత నాలుగు మ్యాచ్​ల్లో 87.09 స్ట్రైక్​రేట్​తో నరైన్​ కేవలం 27 పరుగులే చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో జట్టులో అందుబాటులో ఉన్న హిట్టర్లను ఓపెనర్లుగా పరిశీలించే అవకాశం ఉంది. కానీ, కార్తిక్​ ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు.

మార్పులేవీ ఉండకపోవచ్చు

ప్రస్తుత ఐపీఎల్​లో చెన్నై సూపర్​కింగ్స్​ దూకుడు పెంచింది. ప్రారంభ మ్యాచ్​లో ముంబయిపై గెలుపొందినా.. ఆ తర్వాత జరిగిన మూడు మ్యాచ్​ల్లో పరాజయం పాలైంది. కానీ, కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​తో ఆదివారం జరిగిన మ్యాచ్​లో అద్భుతంగా రాణించింది. ప్రస్తుతం టేబుల్​ దిగువభాగంలో ఉండకుండా టాప్​-4 స్థానాల్లో నిలిచేందుకు జట్టు కృషి చేస్తోంది. పంజాబ్​పై విజయంతో పూర్వవైభవాన్ని తెచ్చుకున్న సీఎస్కే తుదిజట్టులో దాదాపు మార్పులేవి జరిగే అవకాశం లేదు. గతమ్యాచ్​లో ఓపెనర్లుగా షేన్​ వాట్సన్​, డుప్లెసిస్​ అద్భుత ప్రదర్శన చేశారు. వీరిద్దరి భాగస్వామ్యం వికెట్ కోల్పోకుండా జట్టుకు విజయాన్ని అందించింది.

చెన్నై సూపర్​కింగ్స్​, కోల్​కతా నైట్​రైడర్స్​ మధ్య మ్యాచ్​ భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ప్రారంభం కానుంది.

జట్లు​

కోల్‌కతా నైట్ రైడర్స్: దినేశ్​ కార్తీక్ (కెప్టెన్​, వికెట్​ కీపర్​), ఆండ్రూ రస్సెల్, కమలేశ్​ నాగర్‌కోటి, కుల్దీప్ యాదవ్, లూకీ ఫెర్గూసన్, నితీశ్​ రానా, ప్రసిద్ కృష్ణ, రింకూ సింగ్, సందీప్ వారియర్, శివం మావి, శుభ్​మన్​ గిల్, ఇయాన్ మోర్గాన్, వరుణ్ చక్రవర్తి, టామ్ బాంటన్, రాహుల్ త్రిపాఠి, క్రిస్ గ్రీన్, ఎం సిద్ధార్థ్, నిఖిల్ నాయక్, అలీ ఖాన్.

చెన్నై సూపర్ కింగ్స్: యంఎస్ ధోనీ (కెప్టెన్​, వికెట్​ కీపర్​), మురళీ విజయ్, అంబటి రాయుడు, ఫాఫ్ డుప్లెసిస్, షేన్ వాట్సన్, కేదార్ జాదవ్, డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజా, లుంగీ ఎంగిడి, దీపక్ చాహర్, పియూష్ చావ్లా, ఇమ్రాన్ తాహిర్, జోష్ హిట్జ్, శార్దుల్ ఠాకూర్, సామ్ కరన్​, ఎన్ జగదీసన్, కెఎమ్ ఆసిఫ్, మోను కుమార్, ఆర్ సాయి కిషోర్, రుతురాజ్ గైక్వాడ్, కరన్ శర్మ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.