వెలాసిటీతో జరిగిన మహిళల టీ 20 ఛాలెంజ్ మ్యాచ్‌లో సూపర్నోవాస్ 12 పరుగుల తేడాతో విజయం చేందింది. జైపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో వెలాసిటీ ఓడిపోయినప్పటికీ ఫైనల్‌కు అర్హత సాధించింది. నెట్ రన్‌రేట్ మెరుగ్గా ఉండటంతో తుదిపోరుకు చేరింది. ఈ విజయంతో మళ్లీ వెలాసిటీని ఢీ కొట్టనుంది సూపర్నోవాస్. ఈ మ్యాచ్‌లో వ్యాట్(43), మిథాలీ రాజ్(40) మినహా మిగతా బ్యాట్స్ఉమెన్ పెద్దగా ప్రభావం చూపలేదు.
-
Supernovas vs Velocity it is on May 11 of #WIPL pic.twitter.com/aqifcIc4D6
— IndianPremierLeague (@IPL) May 9, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Supernovas vs Velocity it is on May 11 of #WIPL pic.twitter.com/aqifcIc4D6
— IndianPremierLeague (@IPL) May 9, 2019Supernovas vs Velocity it is on May 11 of #WIPL pic.twitter.com/aqifcIc4D6
— IndianPremierLeague (@IPL) May 9, 2019
సూపర్నోవాస్ బౌలర్లలో రాధా యాదవ్, అనుజా పాటిల్, పూనమ్ యాదవ్ తలో వికెట్ తీసుకున్నారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ జెమీ రోడ్రిగ్స్‌కు దక్కింది.
వెలాసిటీ తుదిపోరుకు అర్హత...
-
WATCH: Jemimah's classy 77*(48)
— IndianPremierLeague (@IPL) May 9, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Full video here 📹📹https://t.co/eQ1v5dTbiX #WIPL pic.twitter.com/OCznEeNIxZ
">WATCH: Jemimah's classy 77*(48)
— IndianPremierLeague (@IPL) May 9, 2019
Full video here 📹📹https://t.co/eQ1v5dTbiX #WIPL pic.twitter.com/OCznEeNIxZWATCH: Jemimah's classy 77*(48)
— IndianPremierLeague (@IPL) May 9, 2019
Full video here 📹📹https://t.co/eQ1v5dTbiX #WIPL pic.twitter.com/OCznEeNIxZ
తొలి మ్యాచ్‌లో ట్రైల్ బ్లేజర్స్‌ను ఓడించిన వెలాసిటీ ఈ మ్యాచ్‌లో ఓడినప్పటికీ ఫైనల్‌కు అర్హత సాధించింది. నెట్ రన్‌రేట్‌లో వెలాసిటీ మెరుగ్గా ఉండటంతో తుదిపోరుకు ఎంపికయింది. మే11న జరిగే ఫైనల్లో మళ్లీ సూపర్నోవాస్తోనే తలపడనుంది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సూపర్నోవాస్ 142 పరుగులు చేసింది. 143 పరుగుల లక్ష్యంతో దిగిన వెలాసిటీ ఆరంభంలోనే షఫాలీ వికెట్ కోల్పోయింది. అనంతరం వచ్చిన మ్యాథ్యూస్ కూడా త్వరగా ఔటైంది. ఈ పరిస్థితుల్లో వ్యాట్ నిలకడగా ఆడి ఇన్నింగ్స్‌ను గాడిలోపెట్టింది. ఆద్యంతం నిదానంగా సాగిన వెలాసిటీ... ఇన్నింగ్స్ గెలవలేకపోయింది. కాసేపు మిథాలీ- వేద కృష్ణమూర్తి(30) పోరాడినా ఫలితం లేకపోయింది.
అంతకు ముందు బ్యాటింగ్ చేసిన వెలాసిటీ జట్టులో జెమీ రోడ్రిగ్స్(77) అర్ధశతకంతో ఆకట్టుకోగా... చమారి అటపట్టు(31) రాణించింది. వెలాసిటీ బౌలర్లలో అమిలీయా రెండు వికెట్లు తీసుకోగా.. శిఖా పాండే ఓ వికెట్ తన ఖాతాలో వేసుకుంది.