మహిళల టీ 20 ఛాలెంజ్ టైటిల్‌ను సూపర్నోవాస్ సొంతం చేసుకుంది. వెలాసిటీతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో హర్మన్ సేన 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. జైపుర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో సూపర్నోవాస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (51) అర్ధశతకంతో రెచ్చిపోగా.. చివర్లో మ్యాచ్‌ను గెలిపించింది రాధ (10). వెలాసిటీ బౌలర్లలో జహనారా ఆలం రెండు వికెట్లు తీసుకోగా... అమిలీయా, దేవికా చెరో వికెట్ తీసుకున్నారు. విలువైన ఇన్నింగ్స్ ఆడిన హర్మన్ ప్రీత్‌కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
-
What a moment this for the Supernovas who clinch the final game of #WIPL here in Jaipur 👌🙌 pic.twitter.com/XcUAkThHvL
— IndianPremierLeague (@IPL) May 11, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">What a moment this for the Supernovas who clinch the final game of #WIPL here in Jaipur 👌🙌 pic.twitter.com/XcUAkThHvL
— IndianPremierLeague (@IPL) May 11, 2019What a moment this for the Supernovas who clinch the final game of #WIPL here in Jaipur 👌🙌 pic.twitter.com/XcUAkThHvL
— IndianPremierLeague (@IPL) May 11, 2019
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెలాసిటీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 121 పరుగులు చేసింది. 122 పరుగుల ఛేదనలో సూపర్నోవాస్ ఆరంభంలోనే చమారీ అటపట్టు వికెట్ కోల్పోయింది. కాసేపు ప్రియా(29) , రోడ్రిగ్స్(22) ఇన్నింగ్స్‌ను నిలబెట్టినా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు.
64 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన పరిస్థితుల్లో హర్మన్ విశ్వరూపం చూపించింది. ఆరంభంలో నిదానంగా ఆడినా అనంతరం బ్యాట్ ఝుళిపించింది. 34 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి చివరి ఓవర్లో ఔటైంది.
-
The Supernovas have won off the last ball. They beat Velocity by 4 wickets.
— IndianPremierLeague (@IPL) May 11, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
What a superb finish this to the Women's T20 Challenge 👏👏 pic.twitter.com/NGu9UoSFKc
">The Supernovas have won off the last ball. They beat Velocity by 4 wickets.
— IndianPremierLeague (@IPL) May 11, 2019
What a superb finish this to the Women's T20 Challenge 👏👏 pic.twitter.com/NGu9UoSFKcThe Supernovas have won off the last ball. They beat Velocity by 4 wickets.
— IndianPremierLeague (@IPL) May 11, 2019
What a superb finish this to the Women's T20 Challenge 👏👏 pic.twitter.com/NGu9UoSFKc
ఆఖర్లో ఉత్కంఠ.. గెలిపించిన రాధ
అమిలీయా కేర్ వేసిన చివరి ఓవర్ మొదటి బంతికి పరుగేమి రాలేదు. రెండో బంతికి కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఔటైంది. మూడో బంతికి రాధ యాదవ్ 2 పరుగులు తీసింది. వరుసగా 4,5 బంతుల్లోనూ రెండు పరుగులు తీసి స్కోరును సమం చేసింది. చివరి బంతిని ఫోర్‌గా మలిచి జట్టును గెలిపించింది రాధ.
వెలాసిటీ జట్టులో సుష్మా వర్మ (40), అమిలీయా కేర్ (36) మినహా మిగతా బ్యాట్స్ఉమెన్ పెద్దగా ఆకట్టుకోలేదు. అమిలీయా బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ రాణించింది.