ప్రపంచ వ్యాప్తంగా పేరుతెచ్చుకున్న లీగ్‌లలో ఐపీఎల్ అగ్ర స్థానంలో ఉంది. ఇందులో రాణిస్తే జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడానికిఆటగాళ్లకుమార్గం సుగమమవుతుంది. ప్రతిభ ఉన్న ఆటగాళ్లను డబ్బు పెట్టి కొనుక్కోవడం ద్వారా వారికి ఆర్థిక భరోసా ఇస్తుంది. వారిలోని నైపుణ్యాన్ని బయటకు తీసేందుకు ఇదో పెద్ద వేదికైంది.
- అలాంటి ఈ టోర్నీలో పశ్చిమ్ బంగాకు చెందిన 'ప్రయాస్ రాయ్ బర్మన్' బెంగళూరు తరఫున అరంగేట్రం చేశాడు. అతడి వయసు 16 సంవత్సరాల 157 రోజులు.
- ఈ ఐపీఎల్లో ముంబయి తరఫున కశ్మీర్ ఆటగాడు రసిక్ సలామ్ సైతం 17 ఏళ్ల 353 రోజుల వయసులో అరంగేట్రం చేశాడు.
ఇతడి కన్నా ముందు...
ప్రస్తుతం భారత క్రికెట్లో అదరగొడుతున్న ఆటగాళ్లు హార్దిక్ పాండ్య, బుమ్రా, చాహల్... ఐపీఎల్ ద్వారానే పేరు తెచ్చుకున్నారు.
17 సంవత్సరాల 11 రోజుల వయసులో ముజీబ్ ఉర్ రెహ్మన్... ఐపీఎల్లో తొలి మ్యాచ్ ఆడాడు. 17 ఏళ్ల 177 రోజుల వయసులో సర్ఫరాజ్‌ఖాన్, 17 ఏళ్ల 179 రోజులకు ప్రదీప్ సంగ్వాన్, 17 ఏళ్ల 199 రోజులకు వాషింగ్టన్ సుందర్.. ఐపీఎల్లో అరంగేట్రం చేశారు.