ఓవర్లో ఆరు సిక్సర్లను బాదిన రికార్డు అంటే భారత క్రికెట్ అభిమానులకు ముందుగా గుర్తొచ్చేది టీమ్ఇండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్. అయితే ఈ రికార్డును(Yuvraj Singh Six Sixes) మరో ఇద్దరూ సాధించారు. కానీ, యువరాజ్ సింగ్ తర్వాత మళ్లీ అదే ఘనతను భారత సంతతి అమెరికన్ జస్కరన్ మల్హోత్రా(Jaskaran Malhotra Sixes) సాధించాడు.
ఓమన్ వేదికగా పపువా న్యూగినియా(USA Vs PNG) అమెరికా అంతర్జాతీయ వన్డేలో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 271 స్కోరు చేసింది. అమెరికా ఇన్నింగ్స్‌లోని ఆఖరి ఓవర్‌ను పేసర్ గౌడి టోకా వేయగా.. అదే ఓవర్లోని ఆరు బంతులను జస్కరన్ మల్హోత్రా ఆరు సిక్సర్లు బాది అందర్ని ఆశ్చర్యపరిచాడు. దీంతో ఆ మ్యాచ్‌లో(USA Vs PNG ODI) 173 వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు మల్హోత్రా.
-
6️⃣6️⃣6️⃣6️⃣6️⃣6️⃣!!
— USA Cricket (@usacricket) September 9, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Jaskaran Malhotra has joined an exclusive club of international cricketers to hit 6️⃣ x 6️⃣s in an over with a stunning assault from the final 6 balls of the innings as he becomes the first American to make an ODI 💯 with 173 not out!
USA post 271 for 9 v PNG! pic.twitter.com/pCxHDQS8XO
">6️⃣6️⃣6️⃣6️⃣6️⃣6️⃣!!
— USA Cricket (@usacricket) September 9, 2021

USA post 271 for 9 v PNG! pic.twitter.com/pCxHDQS8XO6️⃣6️⃣6️⃣6️⃣6️⃣6️⃣!!
— USA Cricket (@usacricket) September 9, 2021
Jaskaran Malhotra has joined an exclusive club of international cricketers to hit 6️⃣ x 6️⃣s in an over with a stunning assault from the final 6 balls of the innings as he becomes the first American to make an ODI 💯 with 173 not out!
USA post 271 for 9 v PNG! pic.twitter.com/pCxHDQS8XO
యూఎస్ఏ క్రికెట్ చరిత్రలో ఇది రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు. అంతేకాకుండా అమెరికా క్రికెట్ జట్టుకు వన్డే హోదా వచ్చిన తర్వాత సెంచరీ సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా జస్కరన్ మల్హోత్రా రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు 2019లో యూఏఈ వేదికగా జరిగిన వన్డేలో అరోన్ జాన్స్(95) శతకం దగ్గరగా వచ్చి వెనుదిరిగాడు.
ఆ జాబితాలో..
ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు(Six Sixes in an Over) బాదిన బ్యాట్స్‌మన్ జాబితాలో ఇప్పటికే హెర్షల్ గిబ్స్(దక్షిణాఫ్రికా), యువరాజ్ సింగ్(భారత్), కిరెన్ పొలార్డ్(వెస్టిండీస్) వంటి వారున్నారు. అయితే వన్డేల్లో ఈ రికార్డును సాధించిన తొలి క్రికెటర్ హెర్షల్ గిబ్స్. ఆ తర్వాత అమెరికన్ క్రికెటర్ జస్కరన్ మల్హోత్రా ఘనత సాధించాడు.
ఇదీ చూడండి.. Ind vs Eng: 'ఇంగ్లాండ్‌తో ఆఖరి టెస్టు అనుమానమే'