ETV Bharat / sports

'కోహ్లీసేన టెస్ట్​ క్రికెట్​కు ప్రాణం పోసింది'

ఆస్ట్రేలియాపై అద్భుత విజయంతో టెస్టు క్రికెట్​కు టీమ్ఇండియా ప్రాణం పోసిందని ప్రశంసించాడు న్యూజిలాండ్​ మాజీ ఆటగాడు రిచర్డ్​ హెడ్లీ. ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​ కోసం కివీస్​, భారత జట్టు.. రెండూ బలంగానే ఉన్నాయని చెప్పాడు.

Test cricket
కోహ్లీసేన
author img

By

Published : May 25, 2021, 1:34 PM IST

Updated : May 25, 2021, 4:45 PM IST

ప్రపంచ క్రికెట్‌కు భారత్‌ అవసరం ఉందని న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌ రిచర్డ్ హెడ్లీ తెలిపాడు. ఆస్ట్రేలియాలో అద్భుత విజయంతో కోహ్లీసేన టెస్టు క్రికెట్‌కు మళ్లీ బతికించిందని ప్రశంసించాడు. ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌ మున్ముందు మరింత ఆసక్తికరంగా మారొచ్చని అంచనా వేశాడు.

"టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌ ఒక్క మ్యాచే కాబట్టి రెండు జట్లూ ప్రశాంతంగానే కనిపిస్తున్నాయి. తటస్థ వేదిక కావడం వల్ల ఆసక్తిగా అనిపిస్తోంది. ఇంగ్లాండ్‌లో బంతి బాగా స్వింగ్‌ అవుతుంది. కివీస్‌లో సౌథీ, బౌల్ట్‌, జేమీసన్‌ వంటి నాణ్యమైన పేసర్లు ఉన్నారు. ఇక భారత్‌, కివీస్‌ రెండు జట్లలోనూ తిరుగులేని బ్యాట్స్‌మెన్‌ ఉన్నారు. క్రికెట్‌ ద్వారా భారత్‌ భారీ ఆదాయం ఆర్జిస్తోంది. అందుకే టీమ్‌ఇండియా లేకుంటే ప్రపంచ క్రికెట్‌ ముఖ చిత్రం భిన్నంగా ఉండేది. ఆసీస్‌ చేతిలో 36కే ఆలౌటైనా సిరీస్‌ గెలిచి టెస్టు క్రికెట్‌ను బతికించింది. కుర్రాళ్లు అదరగొట్టారు. భారత్‌లో అన్ని ఫార్మాట్లలో ఆడగల ప్రతిభావంతులు ఉన్నారు."

- హెడ్లీ, న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌.

అత్యున్నత స్థాయి క్రికెట్​లో ప్రతి జట్టూ హోరాహోరీగా పోటీపడతాయని హెడ్లీ తెలిపాడు. విజయం కోసం ప్రత్యర్థి జట్లపై రకరకాల వ్యూహాలు అమలు చేస్తాయని పేర్కొన్నాడు. ఏం చేసినా క్రీడాస్ఫూర్తి గీత దాటకుంటే బాగుంటుందన్నాడు. టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీకి అంకితభావం ఎక్కువన్నాడు. "మ్యాచులో తీవ్ర పోటీనిస్తాడు. జట్టుకు విజయం అందించేందుకు తీవ్రంగా కృషి చేస్తాడు. అతడో ప్రపంచస్థాయి క్రికెటర్​, ప్రతి మ్యాచును గెలిపించాలన్న అంచనా, ఒత్తిడి అతడిపై ఉంటాయి. కోట్లమంది అతడిని ఆరాధిస్తున్నారు" అని కోహ్లీపై హెడ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు.

ఇదీ చూడండి: రోహిత్​ వల్లే ఐపీఎల్ అరంగేట్రం చేశా: చాహల్

Last Updated : May 25, 2021, 4:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.