India Vs Newzealand Semifinals Rainfall : భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్-2023 మెగా టోర్నీ తుది అంకానికి చేరుకుంది. దీంతో మరో వారం రోజుల్లో వరల్డ్‌కప్ జాతర కూడా ముగియనుంది. అయితే ఈ టోర్నీలో ఇప్పటివరకు జరిగిన మ్యాచులన్నీ ఐసీసీ షెడ్యూల్ ప్రకారం సాఫీగానే సాగినా.. కీలక దశలో మాత్రం వరణుడి భయం క్రికెట్ ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది.
నవంబర్ 15, 16 తేదీల్లో సెమీఫైనల్స్ మ్యాచులు జరగనున్నాయి. వీటిల్లో పాల్గొనేందుకు ఇప్పటికే భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు అర్హత సాధించాయి. నవంబర్ 15 బుధవారం ముంబయిలోని వాంఖడే మైదానంలో భారత్-న్యూజిలాండ్ జట్లు తొలి సెమిఫైనల్లో పోటీపడనున్నాయి. మరోవైపు నవంబర్ 16 కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరిగే రెండో సెమీస్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా-ఆసీస్ జట్లు తలపడనున్నాయి.
-
The last four teams 🙌
— ICC (@ICC) November 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Who's your pick to lift the #CWC23 trophy? 🏆 pic.twitter.com/VNe14gb64o
">The last four teams 🙌
— ICC (@ICC) November 12, 2023
Who's your pick to lift the #CWC23 trophy? 🏆 pic.twitter.com/VNe14gb64oThe last four teams 🙌
— ICC (@ICC) November 12, 2023
Who's your pick to lift the #CWC23 trophy? 🏆 pic.twitter.com/VNe14gb64o
ఎన్నో సందేహాలు..
ఇదిలా ఉంటే నవంబర్ 15న జరగనున్న తొలి సెమీస్ మ్యాచ్‌కు మాత్రం వర్షం పడే సూచనలున్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ క్రమంలో ఆ రోజు వర్షం పడితే మ్యాచ్ పరిస్థితేంటి అన్న ప్రశ్నలు సదరు క్రికెట్ అభిమాని మదిలో మెదులుతున్నాయి. ఒకవేళ అదే జరిగితే ఫైనల్‌కు చేరే జట్టేదో అనే సందేహాలూ వస్తున్నాయి. మరి ఈ మ్యాచ్‌కు వరణుడు అడ్డంకిగా మారితే ఇరు జట్లకున్న సాధ్యాసాధ్యాల గురించి ఓసారి చూద్దాం.
-
Semi-Final 1 confirmed 🙌🏻
— BCCI (@BCCI) November 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
🗓️ 15th November
📍 Wankhede Stadium, Mumbai
India 🆚 New Zealand #TeamIndia | #CWC23 | #MenInBlue pic.twitter.com/ETz9TAzyC9
">Semi-Final 1 confirmed 🙌🏻
— BCCI (@BCCI) November 11, 2023
🗓️ 15th November
📍 Wankhede Stadium, Mumbai
India 🆚 New Zealand #TeamIndia | #CWC23 | #MenInBlue pic.twitter.com/ETz9TAzyC9Semi-Final 1 confirmed 🙌🏻
— BCCI (@BCCI) November 11, 2023
🗓️ 15th November
📍 Wankhede Stadium, Mumbai
India 🆚 New Zealand #TeamIndia | #CWC23 | #MenInBlue pic.twitter.com/ETz9TAzyC9
కచ్చితంగా అన్ని ఓవర్లు ఆడాల్సిందే..
2023-వరల్డ్‌కప్ సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌లకు ఐసీసీ ఒక రిజర్వ్‌డేని కేటాయించింది. అంటే బుధవారం భారత్-కివీస్ మధ్య జరిగే మ్యాచ్ వర్షం వల్ల ఆగిపోతే.. ఆ మ్యాచ్ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచే నవంబర్ 16న(గురువారం) తిరిగి మొదలుపెడతారు. అంటే రిజర్వ్ డే రోజున ఇరు జట్లు మళ్లీ ఆటను కొనసాగిస్తాయి. అలాగే ఈ రిజర్వ్ డే రోజు అదనంగా రెండు గంటల సమయాన్ని కూడా కేటాయించింది ఐసీసీ. అయితే ప్రత్యేకంగా కేటాయించిన రోజున ఫలితం తేలాలంటే రెండు జట్లు కనీసం 20 ఓవర్లైనా కచ్చితంగా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది.
రిజర్వ్ డే రోజు కూడా వర్షం పడితే?
ఒకవేళ రిజర్వ్ డే రోజు కూడా వర్షం కారణంగా ఆట ముందుకు సాగకపోతే పాయింట్ల పట్టికలో ఏ జట్టైతే లీడింగ్‌లో ఉందో ఆ టీమ్ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. అయితే వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిస్థాయిలో జరగకపోతేనే రిజర్వ్ డే లభిస్తుంది. ఇక ఇలాంటి సందర్భమే రెండో సెమిఫైనల్ ఆడనున్న దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా జట్లకూ ఎదురైతే అచ్చం పైన వివరించిన పద్ధతినే అనుసరిస్తారు.
అలా కూడా చేరొచ్చు..
రిజర్వ్‌డే వల్ల నవంబర్ 16న జరగాల్సిన మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం నవంబర్ 17న జరుగుతుంది. అయితే నవంబర్ 17 కూడా వాన అంతరాయం కలిగితే నవంబర్ 18న రెండో సెమీస్ ఉంటుంది. అయితే సెమీస్‌లో సందర్భాన్ని బట్టి డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో కూడా ఫైనల్‌కు చేరే జట్లను ప్రకటించే అవకాశం ఉంటుంది. ఏదేమైనా నవంబర్ 19న మాత్రం ఫైనల్ పోరు జరగడం ఖాయం.
-
Predict the winners of the #CWC23 semi-finals and final 🏆⬇️ pic.twitter.com/X7qA50NhYO
— ICC (@ICC) November 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Predict the winners of the #CWC23 semi-finals and final 🏆⬇️ pic.twitter.com/X7qA50NhYO
— ICC (@ICC) November 12, 2023Predict the winners of the #CWC23 semi-finals and final 🏆⬇️ pic.twitter.com/X7qA50NhYO
— ICC (@ICC) November 12, 2023
ఫైనల్ రోజు కూడా వాన పడితే?
ఒకవేళ ఫైనల్ మ్యాచ్ రోజు కూడా వర్షం పడి ఆట పూర్తిగా రద్దైతే.. గ్రూప్ దశలో పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచిన జట్టునే ప్రపంచకప్ ఛాంపియన్‌గా అనౌన్స్ చేస్తారు. ఐసీసీ నిబంధనల ప్రకారం.. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిని ఉపయోగించాలంటే.. ఒక మ్యాచ్‌ను ఒక్కో జట్టుకు 20 ఓవర్ల కంటే తక్కువకు కుదిస్తే విజేతను ప్రకటించడానికి డక్‌వర్త్ లూయిస్ పద్ధతిని వినియోగిస్తారు.
ఒక్కో మ్యాచ్‌కు 20 ఓవర్లు వేయడానికి ముందే మ్యాచ్ రద్దైతే.. ఇక మ్యాచ్ ఫలితం లేదనే ప్రకటన వెలువడుతుంది. ఇక నవంబర్ 12 ఆదివారం జరగనున్న నామమాత్రపు మ్యాచ్‌లో భారత్-నెదర్లాండ్స్ జట్లు ఆడనున్నాయి. ఈ మ్యాచ్‌తో 2023 ప్రపంచకప్ లీగ్ స్టేజీ ముగియనుంది.
భారత్ x నెదర్లాండ్స్ - రోహిత్ సేనలో ఆ మార్పు - విరాట్‌కు కలిసొస్తుందా?
' కెప్టెన్‌గా ఎఫర్ట్ పెడుతాను - వాళ్లు అలా చేయకపోతే ఏ జట్టుకైనా గెలవడం కష్టమే'