Team india: టీమ్ఇండియా కుర్రాళ్లు ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. అండర్-19 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న సెమీస్‌లో ప్రత్యర్థికి 291 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కెప్టెన్ యష్ దుల్(110) అద్భుతమైన సెంచరీతో మెప్పించాడు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోరు 16 పరుగుల దగ్గర రఘువంశీ(6) తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత హర్నూర్ సింగ్(16), రాజవర్ధన్ 13, షేక్ రషీద్ 94 పరుగులతో స్కోరుకు బలమైన పునాది వేశాడు. ఆసీస్ బౌలర్లలో జాక్ నిష్బత్, విలియమ్ షల్జమన్ తలో రెండు వికెట్లు తీశారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: