IND VS WI T20: వెస్టిండీస్ పర్యటనలో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్.. సోమవారం జరిగే రెండో టీ20 కోసం పూర్తిస్థాయిలో సిద్ధమైంది. వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన టీమ్ఇండియా ఐదు టీ20ల సిరీస్‌లో తొలిమ్యాచ్‌లో కూడా విజయ ఢంకా మోగించింది. ఆల్‌రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టింది. రెండో టీ20లో కూడా నెగ్గి 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాలని రోహిత్ సేన భావిస్తోంది.
మళ్లీ సూర్యకుమార్ యాదవ్‌తోనే!.. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో రోహిత్ శర్మతో కలిసి రిషభ్ పంత్ ఓపెనర్‌గా రాగా.. విండీస్‌తో తొలి టీ20లో మాత్రం సూర్యకుమార్ యాదవ్‌కు ఆ అవకాశం దక్కింది. మొత్తంగా ఈ ఏడాది టీ20ల్లో ఏడుగురు ఓపెనర్లను జట్టు పరీక్షించింది. కేఎల్ రాహుల్ అందుబాటులో లేని వేళ.. మళ్లీ సూర్యకుమార్ యాదవే.. రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది.
బౌలింగ్ ఎవరికో?.. తొలి టీ20లో బ్యాటింగ్ విభాగంలో కెప్టెన్ రోహిత్ శర్మ అర్థశతకంతో సత్తా చాటగా దినేష్ కార్తీక్ ఫినిషర్‌గా అదరగొట్టాడు. కేవలం 19 బంతుల్లోనే 41 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ జట్టులో స్థానం సంపాదించుకునే దిశగా కార్తీక్ అడుగులు వేస్తున్నాడు. బౌలింగ్ విభాగంలో అర్షదీప్, అశ్విన్, రవి బిష్ణోయ్, రవీంద్ర జడేజా మెరుగ్గా రాణించారు. స్పిన్ విభాగంలో ఈ రవి త్రయాన్ని టీమ్ఇండియా కొనసాగిస్తుందా లేదా అక్షర్ పటేల్, కులదీప్ యాదవ్‌కు అవకాశం ఇస్తుందా అనేది వేచి చూడాలి.
మరోవైపు వరుసగా ఓటములు ఎదుర్కొంటున్న వెస్టిండీస్ జట్టు ఈ మ్యాచ్‌లోనైనా సత్తా చాటి గాడిలో పడాలని కోరుకుంటోంది. భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.
ఇవీ చదవండి: చెక్ బౌన్స్ కేసులో ధోనీకి ఊరట
అదరగొట్టిన వెయిట్‌లిఫ్టర్లు.. కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు 4 పతకాలు