ETV Bharat / sports

IND VS IRE 3rd T20 : క్లీన్‌స్వీప్‌పై టీమ్​ఇండియా కన్ను.. ఆ ముగ్గురిపై ప్రయోగం​!

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 23, 2023, 7:32 AM IST

IND VS IRE 3rd T20 : తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలుపొంది ఇప్పటికే సిరీస్‌ దక్కించుకున్న టీమ్​ఇండియా ఇప్పుడు మూడో టీ20కు రెడీ అవుతోంది. మరి కొన్ని గంటల్లో ఐర్లాండ్​తో జరగబోయే మ్యాచ్​లో గెలిచి సిరీస్​ను క్లీన్​స్వీప్​ చేయాలనుకుంటోంది.

IND VS IRE 3rd T20 : క్లీన్‌స్వీప్‌పై భారత్‌ కన్ను.. ఆ ముగ్గురిపై ప్రయోగం​!

IND VS IRE 3rd T20 : మొదటి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి ఇప్పటికే సిరీస్‌ను సొంతం చేసుకుంది టీమ్​ఇండియా. ఇప్పుడు క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. ఐర్లాండ్‌తో ఆఖరి పోరులో తలపడేందుకు సిద్ధమైంది. బుధవారం(ఆగస్ట్​ 23) చివరి మూడో టీ20లో పోటిపడనుంది.

  • గాయాల నుంచి కోలుకుని పునరాగమనం చేసిన పేస్‌ బౌలర్లు జస్‌ప్రీత్‌ బుమ్రా, ప్రసిద్ధ్‌ కృష్ట.. ఫిట్‌నెస్‌ను నిరూపించుకుని అద్భుతంగా రాణించడం టీమ్​కు సంతోషాన్నిచ్చే అంశం. ఇప్పుడు రిజర్వ్‌ ప్లేయర్లను పరీక్షించేందుకు ఈ నామమాత్రమైన మ్యాచ్‌... టీమ్‌ఇండియాకు మంచి అవకాశం.
  • అవేశ్​ ఖాన్‌, జితేశ్‌ శర్మ, షాబాజ్‌ అహ్మద్‌ ఇప్పటివరకు ఈ సిరీస్‌ బరిలోకి దిగలేదు. వాస్తవానికి వెస్టిండీస్​ టూర్​ జట్టులో ఉన్న అవేశ్​ మొత్తంగా వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో బెంచ్​లోనే ఉన్నాడు. కాబట్టి నిలకడగా ఆడలేకపోతున్న అర్ష్‌దీప్‌ సింగ్‌ ప్లేస్​లో అతడిని తుది జట్టులోకి తీసుకునే ఛాన్స్​ ఉంటుంది.
  • సంజు శాంసన్‌కు రెస్ట్ ఇచ్చి.. వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ జితేశ్‌ శర్మకు అరంగేట్రం చేసే ఛాన్స్​ ఇవ్వొచ్చు.
  • దేవధర్‌ ట్రోఫీలో అద్భుతంగా రాణించిన షాబాజ్‌ అహ్మద్‌.. టీమ్​ఇండియాకు మరో ఆల్‌రౌండ్‌ ప్రత్యామ్నాయం అని చెప్పొచ్చు. వాషింగ్టన్‌ సుందర్‌కు రెస్ట్​ ఇచ్చి షాబాజ్‌ను ఆడించే ఛాన్స్​లు ఉన్నాయి.
  • ఆసియాకప్‌కు ముందు కెప్టెన్‌ బుమ్రా, ప్రసిద్ధ్‌ కృష్ణ మరింత ప్రాక్టీస్ అవసరం. కాబట్టి.. వారికి రెస్ట్​ ఇవ్వరు.
  • ఫైనల్​గా సంజు ప్లేస్​లో జితేశ్‌ను ఆడించడం తప్ప బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఇంకేమీ మార్పులు ఉండకపోవచ్చు. రెండో టీ20తో అరంగేట్రం చేసిన రింకూ.. 21 బంతుల్లో 38 పరుగులతో ఆకట్టుకున్నాడు. అతడితో పాటు యశస్వి, రుతురాజ్‌ గైక్వాడ్‌లు బాగా ఆడాలని ప్రయత్నిస్తున్నారు.
  • ఇక ఐర్లాండ్‌ తరఫున ఎడమచేతి వాటం స్పిన్నర్‌ వాన్‌ వోర్కమ్‌ అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది. మొత్తంగా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్న టీమ్​ఇండియా క్లీన్‌స్వీప్‌ చేసే అవాకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
  • ఇక పిచ్‌ విషయానికొస్తే.. వాతావరణం మబ్బు పట్టి ఉంది. ఆటకు వర్షం అంతరాయం కలిగించే ఛాన్స్​ ఉంది. చూడాలి ఏం జరుగుతుందో..

Rohit Sharma Asia Cup 2023 : ఈ 'ఐదు' స‌చిన్ రికార్డుల‌ను రోహిత్ బ్రేక్ చేస్తాడా?

Rinku Singh 5 Sixes : 'ఆ 5 సిక్సులు నా జీవితాన్నే మార్చేశాయి.. స్టాండ్స్​లో ఫ్యాన్స్​ అలా చేస్తే చాలా ఇష్టం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.