ETV Bharat / sports

'పంత్​కు భయమంటే తెలియదు.. అతడిలా ఆడతా'

టీమ్​ఇండియా వికెట్​కీపర్​,బ్యాట్స్​మన్​ రిషభ్​ పంత్​ ఆటతీరును తాను ఎంతగానో ఆస్వాదిస్తాడని చెప్పాడు ఇంగ్లాండ్​ ఆటగాడు జాస్​ బట్లర్​. పంత్​కు భయం అంటే తెలియదని, అతడు మంచి ఆటగాడని కితాబిచ్చాడు.

panth
పంత్​
author img

By

Published : Nov 16, 2021, 12:31 PM IST

టీమ్​ఇండియా క్రికెటర్​ రిషభ్​పంత్​ను ప్రశంసించాడు ఇంగ్లాండ్​ ప్లేయర్​ జాస్​ బట్లర్​. పంత్​ ఆటతీరు అద్భుతంగా ఉంటుందని, దాన్ని తాను బాగా ఆస్వాదిస్తాడని చెప్పాడు. అతడు భయం ఎరుగని క్రికెటర్​ అని కితాబిచ్చాడు. వచ్చే నెల 8వ తేదీ నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న యాషెస్​ సిరీస్​లో పంత్​ తరహా భయం లేకుండా ఆడటానికి ప్రయత్నిస్తాడని అన్నాడు. ఆస్ట్రేలియాపై టీమ్​ఇండియా టెస్ట్​ సిరీస్​ గెలిచిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నాడు బట్లర్​.

"ఆస్ట్రేలియాలో పంత్​ ఆటతీరును బాగా ఆస్వాదించా. పరిస్థితికి తగ్గట్టు అటు దూకుడుని ఇటు డిఫెన్స్​ను సమన్వయం చేసుకుంటూ అతడు ఆడేతీరు నాకు బాగా ఇష్టం. అతడికి భయమంటే తెలియదు. నేను కూడా అతడి తరహాలో భయం లేకుండా ఆడటానికి ప్రయత్నిస్తాను."

-జాస్​ బట్లర్​, ఇంగ్లాండ్​.

టీ20వరల్డ్​కప్​ సెమీఫైనల్​లో న్యూజిలాండ్​పై ఓడిపోయింది ఇంగ్లాండ్​. దీని గురించి మాట్లాడుతూ.. "ఈ మెగాటోర్నీలోకి ఇంగ్లాండ్ ఎన్నో ఆశలు,​ భారీ అంచనాలతో బరిలోకి దిగింది. కానీ అనుకున్నది జరగలేదు. ఇక టోర్నీ చివరికి వచ్చే సరికి నేను క్రికెట్​ గురించి ఎక్కువగా పట్టించుకోకుండా సమయం గడపడానికి ప్రయత్నించాను." అని అన్నాడు.

ఇదీచూడండి: కివీస్​తో టెస్టులకు జట్టు ప్రకటన.. రోహిత్, పంత్​కు విశ్రాంతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.