కరోనా కారణంగా మధ్యలోనే ఆగిపోయిన ఐపీఎల్ మళ్లీ మొదలైతే ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ అన్నాడు. రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్చర్.. గాయం కారణంగా ఈసారి లీగ్‌లో అడుగే పెట్టలేదు. అయితే టోర్నీని ఎప్పుడు పునఃప్రారంభించినా ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని ఆర్చర్ చెప్పాడు.
"ఐపీఎల్ ఆడేందుకు భారత్‌కు వెళ్లలేకపోవడం చాలా క్లిష్టమైన విషయం. గాయం అయినప్పుడు రాజస్థాన్ రాయల్స్ నాకెంతో మద్దతుగా నిలిచింది. కానీ కరోనా కారణంగా ఆగిపోయిన టోర్నీ తిరిగి షెడ్యూల్ అయితే ఆడేందుకు సిద్ధంగా ఉన్నా" అని ఆర్చర్ ట్వీట్ చేశాడు.
ఇదీ చదవండి: ఐపీఎల్ స్థాయి వేరు: పాక్ పేసర్
ఈ జనవరిలో ఆర్చర్ చేతి వేలికి గాయం అయింది. అయినా కూడా అతడు భారత్‌తో రెండు టెస్టులు, ఐదు టీ20ల సిరీస్‌లో ఆడాడు. కానీ గాయం ఇబ్బంది పెట్టడం వల్ల మధ్యలోనే మళ్లీ స్వదేశానికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత మళ్లీ భారత్‌కు రాలేదు. ఐపీఎల్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ప్రస్తుతం ససెక్స్ తరఫున కౌంటీ క్రికెట్ ఆడేందుకు సిద్ధంగా ఉన్న ఆర్చర్ ఫామ్ నిరూపించుకునే ప్రయత్నం చేయనున్నాడు. న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్ ముంగిట ఆర్చర్ అందుబాటులోకి రావడం ఇంగ్లాండ్‌కు చాలా కీలకం.
ఇదీ చదవండి: ఇటాలియన్ ఓపెన్ ఫైనల్లోకి రఫా