ETV Bharat / sports

Heath Streak Death : జింబాబ్వే లెజెండరీ క్రికెటర్ మృతి.. క్యాన్సర్​తో పోరాడుతూ..

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 3, 2023, 1:02 PM IST

Updated : Sep 3, 2023, 2:27 PM IST

Heath Streak Death : జింబాబ్వే క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ హీత్‌ స్ట్రీక్‌ క్యాన్సర్​తో పోరాడుతూ.. ఆదివారం కన్నుమూశాడు. దీంతో క్రికెట్​ ప్రపంచం శోకసంద్రంలో మునిగింది. ఆయన మృతి పట్ల పలువురు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.

Heath Streak Death
Heath Streak Death

Heath Streak Death : జింబాబ్వే క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ హీత్‌ స్ట్రీక్‌ (Heath Streak) ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచాడు. 49 ఏళ్ల హీత్​.. క్యాన్సర్​తో పోరాడుతూ కన్నుమూసినట్లు అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో క్రికెట్​ ప్రపంచం శోకసంద్రంలో మునిగింది. ఆయన మృతి పట్ల పలువురు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.

ఇక హీత్ స్ట్రీక్ ఆల్​రౌండర్​గా తన దేశానికి ఎంతో సేవ చేశాడు. హీత్.. 1993-2005 మధ్య కాలంలో జింబాబ్వే జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. తన కెరీర్​లో అంతర్జాతీయంగా 65 టెస్టులు, 189 వన్డే మ్యాచ్​లు ఆడాడు. రెండు ఫార్మాట్లలో కలిపి 4,933 పరుగులు, 455 వికెట్లు పడగొట్టాడు. అయితే హీక్ స్ట్రీక్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సమయంలోనే.. జింబాబ్వే జట్టును మెరుగ్గా తీర్చిదిద్దాడు.

జట్టులో కెప్టెన్​గా, ఆల్​రౌండర్​గా రాణిస్తూ.. జట్టుకు ఎన్నో విజయాలు కట్టబెట్టాడు. ఇక 65 టెస్టుల్లో 216 వికెట్లు తీసి.. జింబాబ్వే తరఫున హైయెస్ట్ వికెట్ టేకర్​గా నిలిచాడు. చివరిసారిగా 2005లో భారత్​పై టెస్టు మ్యాచ్​ ఆడాడు స్ట్రీక్. తర్వాత క్రికెట్​కు గుడ్​బై చెప్పాడు. ఆ తర్వాత 2016 -2018 కాలంలో జింబాబ్వే జట్టుతో పాటు దేళవాళీ లీగ్​ల్లో ఆయా జట్లకు కోచ్​గా వ్యవహరించాడు. బంగ్లాదేశ్ జాతీయ జట్టుకు బౌలింగ్ కోచ్​గానూ స్ట్రీక్ బాధ్యతలు నిర్వర్తించాడు.

స్ట్రీక్ అప్పుడే చనిపోయాడంటూ..
ఇటీవలె స్ట్రీక్ చికిత్స తీసుకుంటున్న సమయంలోనే మరణించాడంటూ అతడి అనుచరుడు హెన్రీ ఒలొంగా ట్వీట్ చేశాడు. అయితే కొద్ది నిమిషాల్లోనే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్​గా మారి.. పలువురు క్రీడా ప్రముఖులు స్ట్రీక్​కు సంతాపం ప్రకటించారు. కాసేపటి తర్వాత స్ట్రీక్ బతికే ఉన్నాడని తెలుసుకున్న హెన్రీ ఒలొంగా.. వెంటనే మరో ట్వీట్ చేశాడు. "స్ట్రీక్ మరణం పట్ల వార్తలనీ రూమర్స్. హీత్​ స్ట్రీక్​ బతికే ఉన్నారు. థర్డ్‌ అంపైర్‌ అతడిని వెనక్కి పిలిచాడు" అంటూ హెన్రీ ట్వీట్​లో రాసుకొచ్చాడు. ఇదిలాఉండగా.. ఇలాంటి విషయాలను ధ్రువీకరించుకోకుండా తొందరపాటుగా అలా పోస్ట్ చేయడం ఏంటంటూ.. నెట్టింట స్ట్రీక్ ఫ్యాన్స్ హెన్రీ ఒలొంగాపై మండిపడ్డారు.

IPL 2023: మినీ వేలంలో ఆ జింబాబ్వే క్రికెటర్​కు ఫుల్ డిమాండ్​!.. కన్నేసిన మూడు టీమ్​లు..

పాక్​ను పడగొట్టి.. విరాట్​ను అధిగమించి.. ఎవరీ సికిందర్ రజా!

Last Updated : Sep 3, 2023, 2:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.