ETV Bharat / sports

హెచ్‌సీఏలో మరో మలుపు.. ఏం జరిగిందంటే?

హెచ్​సీఏ(HCA) అధ్యక్షుడు అజహరుద్దీన్ (Azharuddin)​పై వేటు వేస్తున్నట్లుగా ఇటీవల తీర్మానం చేసిన అపెక్స్​ కౌన్సిల్​ సభ్యులపై అంబుడ్స్​మన్ దీపక్ వర్మ వేటు వేశారు. హెచ్​సీఏ పాలన సజావుగా సాగేలా చూడాలని అధ్యక్షుడి నేతృత్వంలోని అపెక్స్​ కౌన్సిల్ బాధ్యత తీసుకుంటుందని తెలిపారు.

HCA, Ombudsman, deepak varma
హెచ్​సీఏ, అంబుడ్స్​మన్ దీపక్​వర్మ
author img

By

Published : Jul 5, 2021, 9:25 AM IST

హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) (Hyderabad Cricket Association)లో సంక్షోభం మరో కీలక మలుపు తీసుకుంది. అధ్యక్షుడు అజహరుద్దీన్‌ (Azharuddin)పై వేటు వేస్తున్నట్లుగా ఇటీవల తీర్మానం చేసిన అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యులపై హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్‌ దీపక్‌ వర్మ(Ombudsman Deepak Varma) వేటు వేశారు.

హెచ్‌సీఏలో అక్రమాలకు సంబంధించి విచారణ ఎదుర్కొంటున్న ఉపాధ్యక్షుడు జాన్‌ మనోజ్‌, కార్యదర్శి విజయానంద్‌, సంయుక్త కార్యదర్శి నరేష్‌ శర్మ, కోశాధికారి సురేందర్‌ అగర్వాల్‌, కౌన్సిలర్‌ అనురాధలపై తాత్కాలికంగా అనర్హత వేటు వేస్తున్నట్లు దీపక్‌ వర్మ ప్రకటించారు. ఈ ఆదేశాలు అమలు చేయడమే కాకుండా హెచ్‌సీఏ పాలన సజావుగా సాగేలా అధ్యక్షుడు అజహరుద్దీన్‌ నేతృత్వంలోని అపెక్స్‌ కౌన్సిల్‌ బాధ్యత తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి: Mithali Raj: మహిళల క్రికెట్​లో మరో సచిన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.