Gurkeerat Singh Mann Retirement : టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ గుర్కీరత్ సింగ్ మాన్.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. గత మూడేళ్లుగా ఆటకు దూరంగా ఉంటున్న గుర్కీరత్.. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రకటించాడు. 2016లో ఇంటర్నేషనల్ క్రికెట్లో అరంగేట్రం చేసిన అతడు.. కేవలం మూడే వన్డే మ్యాచ్‌లు ఆడాడు. ఆ తర్వాత మళ్లీ జాతీయ జట్టులో అడే అవకాశం గుర్‌కీరత్‌కు దక్కలేదు. ఇక 2012లో ఐపీఎల్ అరంగేట్రం చేసి.. దాదాపు 7 సీజన్లు పంజాబ్ కింగ్స్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఇక 2020లో రాయల్ ఛాలెంజర్స్ జట్టు తరఫున కెరీర్లో చివరిసారిగా మ్యాచ్ ఆడాడు. 2022లో గుజరాత్ జట్టులో ఉన్నప్పటికీ.. గుర్‌కీరత్‌కు బరిలో దిగే అవకాశం రాలేదు. ఇక డొమెస్టిక్ లీగ్‌ల్లో మాన్.. ఇప్పటికీ సొంత రాష్ట్రమైన పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
"ఈ రోజుతో క్రికెట్లో అద్భుతమైన నా జర్నీ ముగిసింది. టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించడం నాకెంతో గర్వకారణం. నన్ను ప్రోత్సహించి, నాకు మద్ధతుగా నిలిచిన బీసీసీఐ, పీసీబీ (పంజాబ్ క్రికెట్ అసోసియేషన్)కు ప్రత్యేక ధన్యవాదాలు. నా కెరీర్లో నాకు సపోర్ట్‌గా నిలిచిన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కోచ్‌లు, నాతోటి ఆటగాళ్లకు కూడా థాంక్స్" అని 33 ఏళ్ల మాన్ సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. అతడి పోస్ట్‌కు పలువురు క్రికెటర్లు స్పందించారు. అతడి తదుపరి కెరీర్‌కు ఆల్ ది బెస్ట్ తెలుపుతున్నారు.
మాన్ కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శనలు..
- ఫస్ట్‌క్లాస్ కెరీర్లో 49 మ్యాచ్‌ల్లో 2942 పరుగులు చేశాడు
- లిస్ట్ A కెరీర్లో 77 మ్యాచ్‌లు ఆడిన మాన్.. 2703 పరుగులు చేశాడు.
- 2015 - 16 రంజీ ట్రోఫీలో గుర్కీరత్ డబుల్ సెంచరీ బాదాడు.
- గుర్కీరత్ మాన్.. 2021 - 22 విజయ్ హరారే ట్రోఫీలో పంజాబ్ జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
- ఐపీఎల్లో 41 మ్యాచ్‌లు ఆడిన మాన్.. 121 స్టైక్ రేట్‌తో 511 పరుగులు చేశాడు. 5 వికెట్లు కూడా పడగొట్టాడు.
సునీల్ నరైన్ షాకింగ్ డెసిషన్ - ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై
క్రికెట్‌కు స్టార్ బౌలర్ గుడ్‌బై వరల్డ్‌కప్ తర్వాత రిటైర్మెంట్