Asia Cup 2022 IND VS PAK match ఆసియా కప్ 2022లో భాగంగా మరి కొన్ని గంటల్లో టీమ్ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ వీక్షిస్తే కఠిన చర్యలు తప్పవని ఓ ఇన్స్టిట్యూట్ ఆంక్షలు విధించింది.
శ్రీనగర్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) యాజమాన్యం ఈ ఆంక్షలు విధించినట్లు కథనాలు వస్తున్నాయి. విద్యార్థలు గ్రూపులుగా ఈ మ్యాచ్ చూడరాదని ఆదేశాలు జారీ చేసిందట. మ్యాచ్ ముగిసిన తర్వాత విద్యార్ధులు ఎలాంటి మీటింగ్‌లు పెట్టవద్దని చెప్పినట్లు తెలిసింది. ఒకవేళ తమ ఆదేశాలు ఉల్లంఘిస్తే.. వారికి రూ.5000 జరిమానాతో పాటు డిబార్ చేస్తామని హెచ్చరించిందట.
కాగా, చివరిసారిగా ఇరు దేశాలు గతేడాది టీ20 ప్రపంచకప్‌లో తలపడగా.. అక్కడ భారత్‌కు ఘోర పరాభవం ఎదురైంది. దాయాది చేతిలో భారత్ 10 వికెట్ల తేడాతో దారుణంగా ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో నేడు జరిగే మ్యాచ్‌లో పాక్‌పై ఎలాగైనా నెగ్గి ప్రతీకారం తీర్చుకోవాలని టీమ్ఇండియా పట్టుదలగా ఉంది.
ఇదీ చూడండి: భారత్ పాక్ మ్యాచ్‌పై కెప్టెన్ రోహిత్ కామెంట్, ఆ విషయం చాలా సీక్రెట్ అంటూ