ETV Bharat / sports

ENG vs NZ: టెస్టు​ల్లో కేన్​ మామ కొత్త రికార్డు.. అతడే నంబర్​ వన్​!

author img

By

Published : Feb 27, 2023, 1:59 PM IST

న్యూజిలాండ్ స్టార్​ బ్యాటర్​ కేన్ విలియమ్సన్​ అరుదైన ఘనత సాధించాడు. కివీస్​ తరఫున అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్​గా రికార్డు సృష్టించాడు. దీంతో పాటు కేన్​ విలియమ్సన్​ బద్దలు గొట్టిన మరిన్ని రికార్డుల వివరాలు.

kane williomson 26th century
kane williomson 26th century

న్యూజిలాండ్​ స్టార్​ బ్యాటర్, మాజీ కెప్టెన్​ కేన్​ విలియమ్సన్ నయా రికార్డు నెలకొల్పాడు. కివీస్​ జట్టు తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్​గా రికార్డు నమోదు చేశాడు. రాస్​ టేలర్​ పేరు మీదున్న రికార్డును బద్దలుగొట్టి ప్రథమ స్థానానికి ఎగబాగాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్​తో జరుగుతున్న టెస్టు సిరీస్​లో భాగంగా ఈ రికార్డు నమోదు చేశాడు కేన్​ విలియమ్సన్.​ 92 టెస్టులు ఆడిన విలియమ్సన్ 53.33 సగటుతో 7787 పరుగులు చేశాడు. రాస్​ టేలర్ 112 టెస్టుల్లో 7683 పరుగులు చేశాడు. కాగా, తన రికార్డును బద్దలుగొట్టిన విలయమ్సన్​కు రాస్​ టేలర్​ అభినందనలు తెలిపాడు.

ప్రస్తుతం ఇంగ్లాండ్​తో టెస్టు సిరీస్​ ఆడుతోంది కివీస్​. మొదటి బ్యాటింగ్​ చేసిన ఇంగ్లాండ్​ 8 వికెట్ల నష్టానికి 435 పరుగులు చేసి డిక్లేర్ ఇచ్చేసింది. దీంతో బ్యాటింగ్​కు దిగిన కివీస్​ 209 పరుగులకు ఆలౌట్​ అయింది. అనంతరం న్యూజిలాండ్​ రెండో ఇన్నింగ్స్‌ ఫాలో ఆన్‌ ఆడింది. ఈ ఇన్నింగ్స్​లో కివీస్ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేశారు. విలియ‌మ్స‌న్‌తో పాటు వికెట్ కీప‌ర్ బ్లండెల్(90) రాణించాడు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 483 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఇక ఈ ఇన్నింగ్స్​లో విలియమ్సన్(132) పరుగులతో చెలరేగిపోయాడు.

విలియమ్సన్ రికార్డుల మోత..
విలియమ్సన్ తాజాగా చేసిన సెంచరీతో తన టెస్టు కెరీర్​లో 26 శతకాన్ని నమోదు చేశాడు కేన్​ విలియమ్సన్. ఇదే కాకుండా న్యూజిలాండ్​ తరఫున 20కి పైగా సెంచరీలు సాధించిన ప్లేయర్​గా చరిత్ర సృష్టించాడు. కేన్​ తర్వాతి స్థానంలో 19 శతకాలతో రాస్​ టేలర్ ఉన్నాడు. విలియమ్సన్ ఇప్పటివరకు ​టెస్టుల్లో 3,930 పరుగులు చేశాడు. ఇక తమ దేశం తరఫున కనీసం 20 టెస్టుల్లో ఆడి.. అందులో అత్యధిక సగటుతో అత్యధిక పరుగులు, సెంచరీలు, 50 ప్లస్​ స్కోరు, డబులు సెంచరీలు చేసిన ఇద్దరు ప్లేయర్లలో విలియమ్సన్​ ఒకరు. మరోవైపు.. శ్రీలంక మాజీ కెప్టెన్​ కుమార సంగక్కర కూడా తన దేశం తరఫున ఈ రికార్డులన్నీ నమోదు చేశాడు. విలియమ్సన్ ఇప్పటివరకు​ 9 దేశాలతో టెస్టు మ్యాచ్​లు ఆడాడు. ఆడిన ప్రతి దేశంతో ఒకటి, అంతకంటే ఎక్కువ సెంచరీలు బాది పూర్తి చేసి రికార్డు నమోదు చేశాడు.

ఇంగ్లాండ్​ తొలి ఇన్నింగ్స్​ : 435/8 (ఇన్నింగ్స్​ డిక్లేర్డ్​)

న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ ​: 209/10

న్యూజిలాండ్​​ రెండో ఇన్నింగ్స్​ : 483/10 (ఫాలో ఆన్)

ఇంగ్లాండ్​ రెండో ఇన్నింగ్స్​ : 48/1 (210 పరుగులు వెనుకంజ) 4వ రోజు ఆట ముగిసేసరికి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.