ETV Bharat / sports

వామ్మో.. కోహ్లీ, అనుష్క బాడీగార్డ్ జీతం మరీ అంతా? - అనుష్క శర్మ బాడీ గార్డ్ జీతం

Kohli Bodyguard: టీమ్ఇండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, హీరోయిన్ అనుష్క శర్మ జోడీ.. వారి బాడీగార్డ్​కు ఇచ్చే జీతం ఎంతో తెలిస్తే షాకవుతారు. ఎన్నో బడా కంపెనీల సీఈఓల కంటే అతడి జీతం చాలా ఎక్కువ. మరి అతడు ఎవరు? అతడి జీతమెంతో తెలుసుకుందామా!

Virat Kohli Bodyguard news, Anushka sharma Bodyguard news, కోహ్లీ బాడీగార్డ్,అనుష్క శర్మ బాడీగార్డ్
Virat Kohli
author img

By

Published : Dec 14, 2021, 5:49 PM IST

Kohli Bodyguard: భద్రత విషయంలో​ సెలబ్రిటీలు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అడుగు బయటపెట్టాలంటే బాడీగార్డులు వారి వెంట ఉండాల్సిందే. తమకు రక్షణ కల్పించే సదరు బాడీగార్డ్​లకు జీతాలు కూడా ఆ స్థాయిలోనే ఇస్తుంటారు. టీమ్​ఇండియా కెప్టెన్, హీరోయిన్ అనుష్క శర్మ కూడా వారి అంగరక్షకుడికి భారీ మొత్తంలో జీతం ఇస్తున్నారు. అది టాప్​ కంపెనీల్లో సీఈఓలకు ఇచ్చే జీతాల కంటే ఎక్కువ కావడం విశేషం.

ప్రకాశ్​ సింగ్ ఉరఫ్ సోనూ.. కొన్నేళ్ల నుంచి అనుష్క శర్మకు బాడీగార్డ్​గా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే స్టార్ క్రికెటర్ కోహ్లీని పెళ్లి చేసుకోకముందు నుంచే ఆమెకు రక్షణగా వెన్నంటే ఉంటూ వస్తున్నాడు. ఓ ప్రముఖ వెబ్​సైట్​ అంచనా ప్రకారం అతడికి ఏడాది రూ.1.2 కోట్ల పారితోషికం అందుతోందట. ఇది నిజమైతే చాలా కంపెనీల్లో సీఈఓలకు ఇచ్చే జీతం కంటే ఇది చాలా ఎక్కువే.

Virat Kohli Bodyguard news, Anushka sharma Bodyguard news, కోహ్లీ బాడీగార్డ్,అనుష్క శర్మ బాడీగార్డ్
బాడీగార్డ్​తో అనుష్క

సోనూను కేవలం బాడీగార్డ్​లానే కాకుండా ఓ కుటుంబ సభ్యుడిలా చూస్తుంటారు కోహ్లీ దంపతులు. అనుష్క శర్మ అయితే ప్రతి ఏడాది అతడి పుట్టినరోజును సెలబ్రేట్ చేస్తుంది. 'జీరో' షూటింగ్​లో ఉన్నప్పుడు కూడా అనుష్క.. సోనూ బర్త్​డే జరిపి, కేక్​ కట్ చేయించింది.

కేవలం అనుష్కకే కాకుండా కోహ్లీకి కూడా బాడీగార్డ్​గా వ్యవహరిస్తుంటాడు సోనూ. విరాట్​కు బాడీగార్డులు ఉన్నప్పటికీ, ఇతడికున్న ప్రాధాన్యం వేరు. అలానే అనుష్క గర్భవతిగా ఉన్న సమయంలోనూ పీపీఈ కిట్​ ధరించి పనిచేశాడు సోనూ.

ఇవీ చూడండి: 'రోహిత్-విరాట్ వివాదం.. బ్రేక్​ తీసుకున్న సమయమే తప్పు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.