టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ(MS Dhoni) కొత్తలుక్‌తో అలరించాడు. ఐపీఎల్ 14వ సీజన్ వాయిదా పడటం వల్ల కొద్ది రోజులుగా రాంచీలోని తన ఫామ్‌హౌజ్‌లో సేదతీరిన ధోనీ ఇప్పుడు కుటుంబంతో వెకేషన్‌కు వెళ్లాడు. తాజాగా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కొవిడ్-19 నిబంధనల్లో ప్రయాణ ఆంక్షలను ఎత్తివేయడం వల్ల కుటుంబంతో సహా మహీ ప్రముఖ పర్యాటక ప్రాంతం సిమ్లాకు వెళ్లాడు. అక్కడ ఓ ఇంటిని అద్దెకు తీసుకొని కొద్దిరోజులు భార్యాబిడ్డలతో విశ్రాంతి తీసుకోనున్నాడు.
-
Pahadi life - MS Dhoni with his friends in Shimla. #Dhoni #MSDhoni @msdhoni pic.twitter.com/2xk4e6ps4I
— MS Dhoni Fans Official (@msdfansofficial) June 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Pahadi life - MS Dhoni with his friends in Shimla. #Dhoni #MSDhoni @msdhoni pic.twitter.com/2xk4e6ps4I
— MS Dhoni Fans Official (@msdfansofficial) June 21, 2021Pahadi life - MS Dhoni with his friends in Shimla. #Dhoni #MSDhoni @msdhoni pic.twitter.com/2xk4e6ps4I
— MS Dhoni Fans Official (@msdfansofficial) June 21, 2021
సిమ్లా టూర్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను జీవా, సాక్షి ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో షేర్ చేశారు. అక్కడ వారు నివసించబోయే ఇల్లు, పరిసర ప్రాంతాల వీడియోలను కూడా పోస్టు చేశారు. అయితే.. ధోనీ, జీవా ఓ కొండపై నిల్చొని తీసుకున్న ఫొటో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. తన గారాల పట్టీతో కలిసి దిగిన ఆ ఫొటోలో చెన్నై సూపర్ కింగ్స్ సారథి మీసం మెలేసి చిరునవ్వుతో పోజిచ్చాడు. మహీని ఇలా చూడటం చాలా బాగుందని అభిమానులు సంబరపడుతున్నారు.
-
.@msdhoni clicked at the airport earlier today! #Dhoni #MSDhoni pic.twitter.com/13L0dpqTpj
— MS Dhoni Fans Official (@msdfansofficial) June 18, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">.@msdhoni clicked at the airport earlier today! #Dhoni #MSDhoni pic.twitter.com/13L0dpqTpj
— MS Dhoni Fans Official (@msdfansofficial) June 18, 2021.@msdhoni clicked at the airport earlier today! #Dhoni #MSDhoni pic.twitter.com/13L0dpqTpj
— MS Dhoni Fans Official (@msdfansofficial) June 18, 2021
ఈ ఏడాది భారత్‌లో నిర్వహించిన ఐపీఎల్ 14(IPL 2021)వ సీజన్ బయోబుడగలో పలువురు ఆటగాళ్లు కరోనా వైరస్ బారినపడటం వల్ల మే 4న టోర్నీని నిరవధికంగా వాయిదా పడింది. అప్పుడు 29 మ్యాచ్‌లు జరగ్గా ఇంకా 31 మ్యాచ్‌లు నిర్వహించాల్సి ఉంది. అయితే, వాటిని సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 15 మధ్య యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. దాంతో మరో మూడు నెలల్లో మహీ మళ్లీ మైదానంలో కనిపించనున్నాడు. కాగా, ఈ సీజన్‌లో చెన్నై(Chennai Super Kings) ఏడు మ్యాచ్‌ల్లో తలపడగా ఐదు విజయాలు సాధించి పది పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఈ సీజన్ పూర్తయ్యాక చెన్నై సారథి వచ్చే ఏడాది ఐపీఎల్‌లో కొనసాగుతాడో లేదోననే సంగతి వెల్లడిస్తాడని ప్రచారం జరుగుతోంది. మరి మహీ ఏం చేస్తాడో వేచిచూడాలి.
-
.@msdhoni with his squad in Shimla. pic.twitter.com/ejP9HLt0fm
— MS Dhoni Fans Official (@msdfansofficial) June 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">.@msdhoni with his squad in Shimla. pic.twitter.com/ejP9HLt0fm
— MS Dhoni Fans Official (@msdfansofficial) June 19, 2021.@msdhoni with his squad in Shimla. pic.twitter.com/ejP9HLt0fm
— MS Dhoni Fans Official (@msdfansofficial) June 19, 2021