ETV Bharat / sports

ఫ్రెండ్ బర్త్​డే వేడుకల్లో ధోనీ హంగామా - అలా చేయడం వల్ల ఫ్యాన్​ సస్పెండ్! - ధోనీ ఫ్రెండ్ బర్త్​డే సెలబ్రేషన్స్

Dhoni Friend Birthday Celebrations : టీమ్ఇండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనీ ప్రస్తుతం వెకేషన్​ మోడ్​లో ఉన్నారు. అయితే తాజాగా తన ఫ్రెండ్​కు సర్​ప్రైజ్​ ఇచ్చి సందడి చేశారు. ఆ విశేషాలు మీ కోసం

Dhoni Friend Birthday Celebrations
Dhoni Friend Birthday Celebrations
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 12, 2023, 8:57 PM IST

Dhoni Friend Birthday Celebrations : టీమ్ఇండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనీ పేరు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం ఆయన తన ఫ్రెండ్స్​, ఫ్యామిలీతో వెకేషన్​ను ఎంజాయ్​ చేస్తున్నాడు. తాజాగా తన ఫ్రెండ్ బర్త్​డే వేడులకు హాజరై ధోనీ సందడి చేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్​చల్​ చేస్తున్నాయి. ధోనీ ఇలా తన స్నేహితులతో స్పెషల్ మూమెంట్స్​ గడపటం చాలా ఆనందంగా ఉందంటూ ఫ్యాన్స్ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.

మరోవైపు, దిల్లీకి చెందిన ఓ స్కూల్​ విద్యార్థి మ్యాథ్స్ ఎగ్జామ్ పేపర్​లో వినూత్నమైన ఆన్సర్​ను రాసుకొచ్చాడు. ఇది చూసిన టీచర్లు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఆ యువకుడు ప్రతి ప్రశ్నకు 'తలా' అని ఆన్సర్ రాశాడట. ధోనీని చెన్నై సూపర్​ కింగ్ ఫ్యాన్స్ ముద్దుగా తలా (నాయకుడు) అని పిలుచుకుంటారు. అయితే ఆ విద్యార్థి అలా చేయడం వల్ల ఆ స్కూల్​ యాజమాన్యం అతడిని సస్పెండ్ చేసిందని సమాచారం. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఇక ఈ వార్త విన్న కొందరు నెటిజన్స్ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ధోని లాంటి వారిని ఇన్​స్పిరేషన్​గా తీసుకుని ఎదగాలని అంతే కానీ కానీ ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ సూచిస్తున్నారు.

ఇక ధోనీ విషయానికి వస్తే.. ఈ ఏడాది(2023) ఐపీఎల్​ ఫైనల్స్​లో గుజరాత్ టైటాన్స్​పై గెలిచి తన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఐదోసారి ట్రోఫీని అందించాడు కెప్టెన్​ కూల్. మోకాలి గాయం కారణంగా రెస్ట్ తీసుకుంటున్న ఈ స్టార్ ప్లేయర్​ శస్త్ర చికిత్స తీసుకుని నెమ్మదిగా కోలుకుంటున్నాడు. 2024 ఐపీఎల్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. అయితే గాయం కారణంగా ధోనీ రానున్న ఐపీఎల్​ సీజన్​లో ఆడతాడా లేదా అనే అనుమానం అభిమానుల్లో కలిగింది. దీంతో ఆందోళన చెందారు. అయితే చెన్నై ఫ్రాంచైజీ తమ రిటైన్డ్​ ప్లేయర్ల లిస్ట్​లో ధోనీని యాడ్​ చేసుకోవడం వల్ల అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.