ETV Bharat / sports

'యువ ఆటగాళ్లకు ఎస్​ఆర్​హెచ్​ ఇచ్చిన సందేశం ఏంటి?'

David Warner SRH: సన్​రైజర్స్​ హైదరాబాద్ జట్టు యాజమాన్యం తనతో వ్యవహరించిన తీరుపై మరోసారి స్పందించాడు ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్. తనను కెప్టెన్​గా తొలగించి, కనీసం జట్టులో స్థానం ఇవ్వకుండా.. యువ ఆటగాళ్లకు ఎస్​ఆర్​హెచ్​ మేనేజ్​మెంట్ ఏం సందేశం​ ఇచ్చిందని ప్రశ్నించాడు.

david warner
డేవిడ్ వార్నర్
author img

By

Published : Jan 7, 2022, 8:53 PM IST

David Warner SRH: ఆస్ట్రేలియా ఓపెనర్​ డేవిడ్​ వార్నర్ గతేడాది ఐపీఎల్​లో చేదు అనుభవం ఎదుర్కొన్నాడు. కారణం కూడా చెప్పకుండా వార్నర్​ను కెప్టెన్సీ నుంచి తొలగిస్తూ సన్​రైజర్స్ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. అయితే.. ఈ అంశంపై మరోసారి మాట్లాడాడు వార్నర్. 'బ్యాక్​స్టేజ్​ విత్ బోరియా' కార్యక్రమంలో భాగంగా సన్​రైజర్స్​ యాజమాన్యం తీరుపై అభిమానులు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారని అన్నాడు.

"కెప్టెన్సీ నుంచి తప్పించి కనీసం జట్టులో కూడా అవకాశం కల్పించకుండా చేసి.. యాజమాన్యం జట్టులోని ఇతర ఆటగాళ్లకు ఇచ్చిన సందేశం ఏంటి? యువ ఆటగాళ్లకు దీనిని ఎలా అర్థం చేసుకోవాలి?. అన్నిటికన్నా బాధించే విషయం ఏమిటంటే.. ప్రస్తుతం జట్టులో ఉన్నవారు కూడా 'మా పరిస్థితీ ఇలానే అవుతుందేమో?' అని ఆలోచిస్తారు."

-- డేవిడ్ వార్నర్, ఆస్ట్రేలియా క్రికెటర్.

తన ఫామ్​పై, కెప్టెన్సీపై మేనేజ్​మెంట్​తో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ వారు అవకాశం ఇవ్వలేదని వార్నర్ తెలిపాడు. అయితే.. వార్నర్​ స్థానంలో ఎస్​ఆర్​హెచ్​ను నడిపించాడు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్. వచ్చే సీజన్​లోనూ కేన్​ కెప్టెన్​ బాధ్యతలు చేపట్టనున్నాడు. కాగా, సన్​రైజర్స్​ జట్టు ఈ సీజన్​ కోసం కెప్టెన్​ విలియమ్సన్​ను, యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్, ఆల్​రౌండర్ అబ్దుల్ సమద్​ను రిటైన్ చేసుకుంది.

ఇదీ చదవండి:

సన్​రైజర్స్​కు వార్నర్, బెయిర్​స్టో గుడ్​బై

'ఆ సమయంలో వార్నర్​కు అండగా ఉంది సన్​రైజర్సే.. మర్చిపోకండి'

'ఫామ్​లోకి వచ్చావుగా'.. వార్నర్​పై సన్​రైజర్స్ కామెంట్స్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.