విధ్వంసకర బ్యాటింగ్‌తో అభిమానులకు ఆనందాన్ని పంచే ఆసీస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్.. కాస్తా ఖాళీ సమయం దొరికినా సామాజిక మాధ్యమాల్లో అలరిస్తుంటాడు. భారతీయ సినిమా పాటలకు స్టెప్పులు వేస్తూ ఫ్యాన్స్‌కు వినోదాన్ని పంచుతుంటాడు.
తాజాగా మరో ఫేమస్ తెలుగు పాటను తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేశాడు వార్నర్. తనకు అత్యంత ఇష్టమైన పాట అంటూ ఆ వీడియో కింద రాసుకొచ్చాడు. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ నటించిన 'రాములో రాములా' పాటకు చిందులేశాడు. ఇప్పుడు ఆ వీడియో తెగ వైరల్‌గా మారింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఈ పోస్ట్‌పై చాలా మంది అభిమానులతో పాటు వార్నర్ భార్య క్యాండీ వార్నర్ కూడా స్పందించింది. 'క్వారంటైన్లో బోర్ కొడుతుందా?' అంటూ అడిగింది. 'ఇప్పుడు నీకెలా అనిపిస్తుందో నాకు తెలుసు. ఈ 14 రోజులు నిన్ను పిచ్చిగా హింసిస్తాను' అని వార్నర్.. తన భార్యకు రిప్లై ఇచ్చాడు.
ఇదీ చదవండి: బోర్డుతో ముదురుతున్న ఆటగాళ్ల కాంట్రాక్ట్ వివాదం!