ప్రస్తుతం ఇంగ్లాండ్ - న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వరల్డ్‌కప్ ఫైనల్లో ఓ ఆసక్తికర అంశం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌కు అంపైరింగ్ చేస్తున్న కుమార ధర్మసేన ప్రపంచకప్ ఛాంపియన్‌గా నిలిచిన జట్టులో సభ్యుడు. 1996లో విశ్వవిజేతగా నిలిచిన శ్రీలంక జట్టులో భాగస్వామి.
ప్రపంచకప్ సభ్యుడై.. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్‌కు అంపైరింగ్ చేస్తున్న ఏకైక వ్యక్తిగా కుమార ధర్మసేన కీర్తిగడించాడు. 48 ఏళ్ల ధర్మసేన 1993 నుంచి 2004 మధ్య లంక జట్టు తరఫున 141 వన్డేలు, 31 టెస్టులు ఆడాడు. ఆల్‌రౌండర్‌గా ఆకట్టుకున్నాడు. అనంతరం అంపైర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.
ఇది చదవండి: అప్పుడు సహచరులు... ఇప్పుడు ప్రత్యర్థులు