మైదానంలో ఆటగాళ్లు వికెట్ తీసినా, మంచి ప్రదర్శన చేసినా, చక్కటి ఇన్నింగ్స్ ఆడినా సహచరులు మెచ్చుకుంటారు. అభిమానులైతే నచ్చిన బ్యాట్స్‌మెన్, బౌలర్ రాణించినపుడు కేరింతలు కొడతారు. ఆదివారం ఓవల్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌లో మాత్రం స్టేడియం మొత్తం టీమిండియా ఫ్యాన్స్‌తో నిండిపోయింది. ఆసీస్‌కు మద్దతిచ్చేవారే కరవయ్యారు. అయితే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఆడుతున్న సమయంలో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ అద్భుత ఫీల్డింగ్‌తో అదరగొట్టాడు.
బాల్ టాంపరింగ్ ఉదంతంతో ఏడాది నిషేధం ఎదుర్కొని బరిలోకి దిగిన స్మిత్‌ను కొంత మంది భారత అభిమానులు 'మోసగాడు' అంటూ కించపరిచేలా నినాదాలు చేశారు. ఇది గమనించిన కోహ్లి ఓవర్ మధ్యలో ఆ అభిమానుల వైపు చూస్తూ.. స్మిత్‌ను విమర్శించడం మాని అభినందించండి అంటూ సంకేతమించాడు. ఆ తర్వాత నినాదాలు ఆగిపోయాయి. ఇది గమనించిన స్మిత్ అభినందనపూర్వకంగా విరాట్‌తో చేయి కలిపాడు. ఈ వీడియో నెట్టింట్లో విపరీతంగా ఆకట్టుకుంటోంది. విరాట్ మంచి ఆటగాడు మాత్రమే కాదు స్ఫూర్తినిచ్చే క్రికెటర్‌గా మరోసారి నిరూపించుకున్నాడని ఫ్యాన్స్ కొనియాడుతున్నారు.
-
With India fans giving Steve Smith a tough time fielding in the deep, @imVkohli suggested they applaud the Australian instead.
— ICC (@ICC) June 9, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Absolute class 👏 #SpiritOfCricket #ViratKohli pic.twitter.com/mmkLoedxjr
">With India fans giving Steve Smith a tough time fielding in the deep, @imVkohli suggested they applaud the Australian instead.
— ICC (@ICC) June 9, 2019
Absolute class 👏 #SpiritOfCricket #ViratKohli pic.twitter.com/mmkLoedxjrWith India fans giving Steve Smith a tough time fielding in the deep, @imVkohli suggested they applaud the Australian instead.
— ICC (@ICC) June 9, 2019
Absolute class 👏 #SpiritOfCricket #ViratKohli pic.twitter.com/mmkLoedxjr
ఇవీ చూడండి:
WC19: ఆసీస్‌పై భారత్ అద్భుత విజయం